WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిడిపిలోకి...డిఎల్‌ రవీంద్రారెడ్డి....!?

మాజీమంత్రి డిఎల్‌.రవీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మార్గం సుగమైంది. 2014లో మైదుకూరు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి 'పుట్టా సుధాకర్‌యాదవ్‌' ఓడిపోయిన విషయం విదితమే. మళ్లీ ఆయననే పోటీ చేయించినా..విజయం సాధించే అవకాశాలులేవని..వివిధ వర్గాల నివేదికను పరిగణలోకి తీసుకున్న 'చంద్రబాబు'...పుట్టాను అయిష్టంగానే టీటీడీ ఛైర్మన్‌ పదవిలో నియమించారు. అంతకు ముందు...వేరే కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమిస్తానని..'పుట్టా'కు 'చంద్రబాబు' సూచించినప్పటికీ...తనకు టీటీడీ తప్ప వేరే పదవి వద్దని భీష్మించుకున్నారు. అమలాపురంలో వైకాపా అభ్యర్థిని ఓడించాలంటే..మాజీమంత్రి డి.ఎల్‌.రవీంద్రారెడ్డి వర్గం..పుట్టా వర్గం కలసిమెలసి పనిచేస్తే సాధ్యమవుతుందని 'చంద్రబాబు'కు తెలుసు. డిఎల్‌ మాత్రమే అక్కడ విజయం సాధించగలరని, పుట్టాకు వేరే పదవి ఇచ్చి సంతృప్తి పరచాలని భావించి..ఎట్టకేలకు ఆయనను టిటీడీ ఛైర్మన్‌గా నియమించారు. దీంతో..డి.ఎల్‌.రవీంద్రారెడ్డి టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నాయి. 'పుట్టా'కు టీటీడీ పదవి ఇచ్చిన నేపథ్యంలో ఆయన సామాజికవర్గానికి చెందిన వారు సంతృప్తి చెంది..పార్టీ డిఎల్‌కు టిక్కెట్‌ ఇస్తే...ఆయనకు మద్దతు ఇవ్వడం ఖాయమని...రాజ్యసభ సభ్యుడు..సిఎం రమేష్‌ ఇంతకు ముందే చంద్రబాబుకు సూచించారు. 

  డిఎల్‌ను పార్టీలో చేర్చుకోవాలని 'జగన్‌' భావించినప్పటికీ...ఆయన స్వయాన మేనమామ..అయిన రవీంద్రారెడ్డి అంగీకరించకపోవడంతో..మరికొద్ది రోజులు..ఆగుదామని భావించిన 'జగన్‌'కు తాజా పరిణామాలు ఖంగుతినిపించాయని చెప్పవచ్చు. నియోజకవర్గంలో.. 1978,1983, 1989,1994, 2004,2009ల్లో విజయం సాధించి మంత్రి పదవి కూడా నిర్వహించారు డిఎల్‌ రవీంద్రారెడ్డి. 1985లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన 'రఘురామిరెడ్డి' కాంగ్రెస్‌ అభ్యర్థి డి.ఎల్‌.రవీంద్రారెడ్డిని ఓడించారు. అదే రఘురామిరెడ్డి 2014లో వైకాపా అభ్యర్థిగా విజయం సాధించారు. నియోజకవర్గంలో 'పుట్టా' డిఎల్‌,రఘురామిరెడ్డి వర్గాలు బలంగా ఉన్నాయి. 2014లో డిఎల్‌ మౌనం వహించడం వల్లే..'రఘురామిరెడ్డి' విజయం సాధించారనేది వాస్తవం. ఈసారి 'పుట్టా' డిఎల్‌కు మద్దతు ఇస్తే..వైకాపా అభ్యర్థి ఎవరైనా టిడిపి విజయం సాధించడం ఖాయమని 'చంద్రబాబు'కు తెలుసు. అందుకే పావులు కదిపారు..ఎవరెవరిని సంతృప్తి పరచాలో..వారిని సంతృప్తి పరిచారు. ఒకవేళ డిఎల్‌ టిడిపిలో చేరకపోతే పరిస్థితి ఏమిటి..? ఇప్పటికే డిఎల్‌ను పార్టీలో చేర్చుకుని...రఘురామిరెడ్డిని మరొక నియోజకవర్గానికి పంపిస్తే ఎలా ఉంటుందో...అన్న దానిపై 'జగన్‌' ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ...రఘురామిరెడ్డి..ఇంకో నియోజకవర్గానికి వెళ్లే అవకాశాలు లేవు. ఎందుకంటే... ఆయన 'జగన్‌' తండ్రిని రాజశేఖర్‌రెడ్డిని పలుదఫాలు ఢీ కొన్నారు. మొండివాడు, గట్టివాడని... 'రఘురామిరెడ్డి'కి పేరుంది. ఇక రాఘురామిరెడ్డి మద్దతు లేకుంటే వైకాపా అభ్యర్థి ఘోరంగా ఓడిపోవడం ఖాయం. కారణమేమిటంటే...రఘురామిరెడ్డి టిడిపిలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే విజయం సాధిస్తారని 'జగన్‌'కు తెలుసు. మూడు వర్గాల్లో రెండు వర్గాలు కలిసిన వారే విజయం సాధిస్తారని ఇంతకు ముందు జరిగిన ఎన్నికలు నిరూపించారు. 'చంద్రబాబు' ఆలోచనలు...ఏ విధంగా ఉన్నాయో..ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.

(273)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ