WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వర్గమే 'జూపూడి'కి శాపం...!

ఆర్టీసీ ఛైర్మన్‌గా జూపూడి ప్రభాకర్‌రావును నియమించబోతున్నారని గతంలో 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనం ప్రచురించిన విషయం విదితమే. అప్పట్లో..'జూపూడి'ని ఆర్టీసీ ఛైర్మన్‌గా నియమించాలని 'చంద్రబాబు' నిర్ణయం తీసుకున్న విషయం యధార్థమే. దళిత వర్గంలో దండోరా వర్గంలోని మెజార్టీ ఓటర్లు టిడిపికి మద్దతు ఇస్తున్నారని..మరొక వర్గ ఓటర్లు ఎక్కువ మంది వైకాపాకు మద్దతు ఇస్తున్నారని..ఈ నేపథ్యంలో..దండోరా వర్గానికి ప్రాధాన్యత ఇస్తే...అదనంగా ఆ వర్గానికి చెందిన ఓటర్లును ఆకర్షించవచ్చునని..అదే జూపూడి వర్గానికి చెందిన వారికి ఆ పదవి ఇస్తే...95శాతంపైగా ఓటర్లు వైకాపా వైపు మద్దతు చూపుతున్నారని...దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కొందరు నాయకులు సూచించడంతో...అప్పట్లో...'జూపూడి' నియామకానికి బ్రేక్‌ పడింది. అంతే కాకుండా...రాజ్యసభ సీటు ఆశించిన 'వర్ల రామయ్య'కు ఆ పదవి దక్కలేదని, తన వర్గంలో ఓటర్లలో వ్యతిరేకత వ్యక్తం అవుతుందని 'చంద్రబాబు'కు బూచిగా చూపించారు. 

  'జూపూడి' అంటే అభిమానంతోపాటు...ఆయనకు ఉన్న వాగ్ధాటి..విపక్షాలను ఎదుర్కొనే సామర్ధ్యంతో..ఆయననే ఛైర్మన్‌గా నియమిస్తే...అటు సంస్థ పరంగా...ఇటు రాజకీయ పరంగా సమర్థవంతంగా ఎదుర్కొంటారని 'చంద్రబాబు' నమ్మకం. అందుకే..ఇన్నాళ్లూ ఆ పదవిని భర్తీ చేయకుండా... వదిలేశారు 'చంద్రబాబు'. 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనాన్ని చూసిన 'జూపూడి' ఆ పదవి తనకే దక్కుతుందని భావించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు కూడా ....జూపూడిని కాబోయే ఆర్టీసీ ఛైర్మన్‌గా పరిచయం చేశారు. ఇంతలో రాజకీయంగా, కులపరంగా 'జూపూడి'కి అడ్డంకులు ఎదురయ్యాయి. దాంతో ఆయన గతంలో బాధ్యతలు నిర్వహించిన ఎస్సీ కార్పొరేషన్‌కే మళ్లీ ఛైర్మన్‌గా నియమించారు. ఇదే ఆర్టీసీ ఛైర్మన్‌ను..మూడేళ్ల క్రితం నియమిస్తే...మరికొందరికి పదవులు దక్కేయి కదా..అన్న అభిప్రాయం టిడిపి కార్యకర్తల్లో ఉంది.

(బి.ఆర్‌.కె.మూర్తి)

(197)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ