WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం

స్సీకర్ కోడెల నేతృత్వంలో నుంచి నాలుగు రోజుల పాటు అధ్యయన యాత్ర

యునిసెఫ్ ఆధ్వర్యంలో తల్లీ బిడ్డల ఆరోగ్యం’ సదస్సుల్లో హాజరు:ఆయా రాష్ట్రాల్లో ఆరోగ్య పథకాల అమలు పరిశీలన

 సచివాలయంఏప్రిల్ 11 : హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నెల 9 నుంచి 12 వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు ‘తల్లీ బిడ్డల ఆరోగ్యం’ అనే అంశంపై సదస్సులు జరుగుతున్నాయి. యూనిసెఫ్, హర్యానా ప్రభుత్వం ఆధ్వర్యంలో  జరుగుతున్న ఈ సదస్సులకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం హాజరైంది. ఈ మేరకు స్సీకర్ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఈ నెల 9వ తేదీన హర్యానా రాజధాని చండీఘర్ కు చేరుకుంది. మొదటి రోజుల చంఢీఘర్ లో భేటీ బచావో...భేటీ పడావో, లింగనిర్ధారణ పరీక్షల నిరోధక చట్టం, సివిల్ రిజిస్ట్రేషన్ల ద్వారా జనన ధ్రువీకరణ పత్రాల జారీ అనే అంశాలపై జరిగిన సదస్సులో ఈ బృందం పాల్గొంది. అనంతరం 10వ తేదీన హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో స్పీకర్ నేతృత్వంలోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పర్యటించారు. ఆ రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య పథకాల గురించి ఈ బృంద సభ్యులు అధ్యయనం చేశారు. మూడో రోజు ఏప్రిల్ 11వ తేదీన సిమ్లా నుంచి బయలుదేరి, మండి జిల్లా కేంద్రంలో పర్యటించారు. పలు ప్రభుత్వ ఆసుపత్రలను సందర్శించారు. ఆయా ఆసుపత్రుల్లో అందిస్తున్నవైద్య సేవలు, గర్భిణుల పట్ల తీసుకుంటున్న చర్యలు, ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ యోజన(పీఎంఎస్ఎంఎ) పథకం అమలు తీరును, ఎఎన్ఎంలు, ఇతర ఆరోగ్య వర్కర్ల పనితీరు ను పరిశీలించారు. ఇలా మూడు రోజుల పర్యటనలో ఆ రెండు రాష్ట్రాల్లో గర్భిణుల ఆరోగ్య రక్షణకు తీసుకుంటున్న చర్యలు, ఆశా వర్కర్ల పాత్ర, మాతా శిశు మరణాలు తగించడం, తల్లీ పిల్లలకు మౌలిక వసతులు కల్పించడం, డయేరియా మేనేజ్ మెంట్, అంగన్వాడీల ద్వారా పిల్లల ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై అధ్యయనం చేయడమే కాకుండా సమీక్షా సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ఈ బృందం ఈ నెల 12 తేదీన తిరిగిరానుందని స్సీకర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఈ పర్యటనలో స్పీకర్ కోడెల, ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బి.అశోక్, వై.సాంబశివరావు, ఎం.గీత, వి.అనిత, టి.సౌమ్య, ఎం.సుగుణమ్మ, కె.అప్పలనాయుడు, పీలా గోవింద సత్యనారాయణ, ఎ.రాధాకృష్ణ. ఎమ్మెల్సీలు జి. శ్రీనివాసులు, వై.శ్రీనివాసులురెడ్డి, కె,నరసింహారెడ్డి, జి.సంధ్యారాణి, పి.శమంతకమణి, అసెంబ్లీ ఇన్ ఛార్జ్ సెక్రటరీ విజయరాజుతో పాటు ఆయా రాష్ట్రాల మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, యూనిసెఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

(92)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ