WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పెద్ది'కి అంత జీతమా...!?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు రాష్ట్ర పంచాయితీరాజ్‌ మంత్రి 'నారా లోకేష్‌'కు రాజకీయ సలహాలు ఇచ్చే ప్రణాళికా సంఘం సభ్యుడు 'పెద్ది రామారావు'కు జీతం, ఇతర సౌకర్యాలు  ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో 'పెద్ది రామారావు' మంత్రి నారా లోకేష్‌కు సలహాదారుగా ఉండేవారు. ఆయన 'లోకేష్‌' ప్రసంగాలను, మాట్లాడే తీరుపై తర్ఫీదు ఇచ్చేవారు. 'లోకేష్‌' ప్రసంగాలకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది...ఏయే...అంశాలపై ఎలా మాట్లాడాలి..అనే దానిపై 'పెద్ది' సలహాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. తరువాత...ఆయనను ప్రణాళికా సంఘ సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. దీనికి కాను నెలకు లక్ష రూపాయల జీతంతో పాటు...ఇతర భత్యాలను కల్పిస్తూ ప్రభుత్వం జీవీ విడుదల చేసింది. అయితే..తాజాగా ఆయనకు ప్రభుత్వ సలహాదారుల వలే...ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు..దానికి కావాల్సిన స్టాప్‌ను ఇవ్వనున్నట్లు జీవీలో స్పష్టం చేశారు. దీనిపై కొన్ని మీడియా వర్గాలు పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నాయి.  'పెద్ది'కి భారీ ఎత్తున ప్రభుత్వం జీతం ఇస్తూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తోందని, అంత జీతం ఆయనకు ఇవ్వాల్సిన అవసరం లేదని, అదే విధంగా ఇతర సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తోంది. ఈ విషయంపై 'సాక్షి' పత్రికతోపాటు...మరి కొన్ని వెబ్‌సైట్లు...ఈ విషయాన్ని హైలెట్‌ చేసి..ప్రచారం చేస్తోన్నాయి. కాగా..ఈ విషయంపై టిడిపి నాయకుల మాట మరో విధంగా ఉంది. ప్రణాళికా సంఘ సభ్యుడిగా...ఆయనకు ఇతరుల వలే...జీతం, ఇతర సౌకర్యాలు  ఇస్తున్నా...అదేదో....చేయరాని తప్పు అన్నట్లు ప్రచారం చేయటం తగదని వ్యాఖ్యానిస్తున్నారు.  


(441)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ