WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

జానీమూన్‌ను తొలగించి...బీసీని ఛైర్మన్‌ను చేస్తారా...?

గుంటూరు జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా రెండున్నరేళ్లు ఒకరు..మరో రెండున్నరేళ్లు మరొకరు...అంటూ అప్పట్లో..ఆ ఇద్దరిని ఒప్పించి..ముందుగా ముస్లిం వర్గానికి చెందిన జానీమూన్‌ను జడ్పీ ఛైర్మన్‌గా చేసిన విషయం విదితమే. సుమారు నాలుగేళ్లు పూర్తి అవబోతోంది. ఆరు నెలల ముందు దీనిపై కొంత హడావుడి జరిగినా..మంత్రి పుల్లారావు తెరవెనుక ఉండి..జానీమూన్‌కు మద్దతు ఇచ్చి...మార్పు జరగదన్న సంకేతాలు ఇప్పించారు. మీ ఇష్టం ఆలోచించుకోండి...ఇప్పటికీ ముస్లిం వర్గాల్లో ఎక్కువ మంది వైకాపాకు మద్దతు ఇస్తున్నారు. బీసీలే పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. బిసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే...రేపు ఏమని ఓట్లు అడుగుతారు..? అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్న మాట వాస్తవమేనని...అప్పట్లో....ఆహామీని అమలు చేయలేకపోయిన అసమర్థులమని చెప్పుకుంటారా..? టిడిపి బిసి నాయకులు ముఖ్య నాయకులను నిలదీశారు. బిసి నేతల వాదనల్లో నిజం ఉందని..అనేక గ్రామాల్లో గౌడు, యాదవ,పద్మశాలి ఇతర బిసీ ఓటర్లు టిడిపి వైపే ఉంటున్నారని...రేపు ఈ వివాదం ముదిరితే పరిస్థితిలో మార్పు రావచ్చునని..దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోకపోతే నష్టం వాటిల్లుతుందని పలువురు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎక్కడో..మారు మూల గ్రామంలో ఉన్న జానీమూన్‌ను జెడ్పీ ఛైర్మన్‌గా చేశారు. గత ఏడాది నుంచి ఒప్పందం ప్రకారం పదవి తమకు ఇవ్వాలని కోరుతున్నామని...కానీ మంత్రి పుల్లారావు..ఇతర ఎమ్మెల్యేలు..స్పందించలేదని...రేపు ఓటర్లకు ఏమని సమాధానం చెబుతారని...రేపు విపక్షాలు ఓటర్ల దృష్టికి తీసుకెళితే...పరిస్థితి ఏమిటి..? అని సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. 

  ఈ వివాదం గతంలో బయటకు వచ్చింది..పరస్పరం ఆరోపణలు...విమర్శలు చేసుకున్నారు..చివరకు కొట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు జానీమూన్‌ నిక్షేపంగా ఉన్నారు. మరో సంవత్సరంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒప్పందం ప్రకారం బిసీ వర్గానికి చెందిన వారిని ఛైర్మన్‌గా నియమించాలని మళ్లీ ఒత్తిడి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారు చెప్పిన వాదనలో నిజం లేకపోలేదని...ఇప్పటికీ మెజార్టీ ముస్లిం వర్గాలు జగన్‌కుమద్దతుఇస్తున్నారని...అదే విధంగా బీసీలు టిడిపికి మద్దతు ఇస్తున్నారని...అపార రాజకీయ అనుభవం ఉన్న టిడిపి ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు ఈ వివాదంపై దృష్టి సారించకుంటే...వారి నియోజకవర్గాల్లో..బీసీ నాయకులు వ్యతిరేక ప్రచారం చేస్తే..అందుకు మూల్యం చెల్లించకతప్పదు. దీనిపైపలువురు ఎమ్మెల్యేలను 'జనమ్‌ప్రత్యేకప్రతినిధి' వివరణ అడగగా..అందులో కొందరు స్పందిస్తూ..బీసీ వర్గానికి జడ్పీ పదవి ఇవ్వడం తప్పులేదు..దీన్ని అనవసరంగా మాజీ మంత్రి రావెల వివాదాస్పదం చేశారు..తమ నియోజకవర్గంలో బీసీలు కూడా దీనిపై అడుగుతున్నారని..ఈ విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళతామని చెబుతున్నారు. కాగా...మరో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయని...ఇప్పుడు మార్పులు..చేర్పులు అవసరమా..? అని తేలిగ్గా కొట్టేస్తున్నారు. మరి దీనిపై అధినేత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో...చూడాల్సిందే.!

(399)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ