WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అజయ్‌' తిరుగుబాటు వెనుక..మాజీ...తాజా ఐఎఎస్‌లు..!

మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కల్లం అజేయరెడ్డి (అజేయకల్లం) ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన ఆరోపణలు, విమర్శల వెనుక ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండే శాఖాదిపతి ప్రోద్బలం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు పేరు కూడా ఈ విషయంలో తెరపైకి వస్తోంది. సాక్షి ఛానెల్‌కు అజయ్‌కల్లం స్వయంగా పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చారా..? కొంత మంది మీడియా వారిని 'అజయ్‌' వద్దకు పంపారా...? అనే విషయంపై ఇంటిలిజెన్స్‌ వర్గాలు ఆరా తీస్తున్నాయి. అజయ్‌ ఎందుకు 'చంద్రబాబు'ను ఎందుకు టార్గెట్‌ చేశారనే దానిపైమరో కథనం వినిపిస్తోంది. 'అజయ్‌'కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమింళీత సమయంలో హామీ ఇచ్చారని..ఆఖరి నిమిషంలో కేంద్రం అనుమతి ఇవ్వనందని...తానే సంబంధిత అధికారులతో మాట్లాడాననే సాకు చూపి..ఆయన రిటైర్‌ అయిన తరువాత 'దినేష్‌కుమార్‌'ను ఆ పోస్టులో నియమించారని 'అజయ్‌' నమ్మకం. కానీ...అప్పట్లోనే 'రియల్‌ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌' పోస్టులో నియమిస్తానని సిఎం చెప్పారని..పలుసార్లు కలిసినా అదుగో..ఇదుగో అని కాలయాపన చేశారని..'అజయ్‌' బయటపడ్డారు. చివరకు ఆ పోస్టు తనకు దక్కదనే పరిస్థితి ఏర్పడడంతో..ఆ కోపంతోనే ఇటువంటి విమర్శలు చేశరనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలు ఏమైనప్పటికీ...సచివాలయంలో శాఖాధిపతిగా పనిచేస్తోన్న అధికారి, రిటైర్డ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వైకాపాకు చెందిన నాయకులు మరియు మీడియా సంస్థల ప్రతినిధులకు కొందరి హస్తం ఇందులో ఉందని..విచారణ జరిపితే..వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.  

(278)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ