WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆశించిందొక్కటీ..దక్కింది మరొక్కటి...!?

టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మంత్రి పదవి ఆశిసించారు. ఎమ్మెల్సీ పదవి ఆశించిన ఒకరికి బోర్డు సభ్యుని పదవి దక్కింది. వివరాల్లోకి వెళితే...ఎమ్మెల్యే అనిత, ఎమ్మెల్యేలు పార్థసారధి, బోండా ఉమామహేశ్వరరావు, శివాజీలు మంత్రి పదవిని ఆశించారు. ఆ పదవి దక్కకపోవడంతో..బాహాటంగా విమర్శించారు. ఎమ్మెల్యే పదవి ఆశించిన రుద్రరాజు పద్మరాజు బోర్డు సభ్యని పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ నుంచి టిడిపిలో చేరిన ఆయనకు తనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశపడ్డా...ఇవ్వకపోయినా..సరిపెట్టుకుంటానని.. కానీ...విమర్శలు చేయనని చెప్పారు. మంత్రి పదవి దక్కకపోవడంతో..కాపులకు చంద్రబాబు అన్యాయం చేశారని ఆరోపించిన బోండా ఉమామహేశ్వరరావుకు తరువాత వివిధ ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా విజయవాడలోని భూములు ఆక్రమణ, వడ్డీ వ్యాపారాలపై విమర్శలు వచ్చాయి. మరో వైపు టీటీడీ ఛైర్మన్‌గా నియమించబడిన 'సుధాకర్‌యాదవ్‌'పై గత ఆరు నెలలుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీటీడీలో అన్యమతస్తులు ఉన్నారని నోటీసులు ఇవ్వడం..ఇన్ని సంవత్సరాలు సర్వీసు చేసిన వారిని తొలగిస్తారా..? అని హైకోర్టు ప్రశ్నించింది. టీటీడీలో ఇతర మతస్తులు ఉన్నారని..వారిని తొలగించాలని హిందూమత పీఠాదిపతులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. కాగా..ఇప్పుడు ఎమ్మెల్యే క్రిస్టియన్‌ అని తేలడంతో...'చంద్రబాబు'పై వీరు మరింత ధ్వజమెత్తే అవకాశం ఉంది.


(176)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ