నిరుద్యోగుల మోసగించిన 'దేవానంద్‌'కు మళ్లీ డైరెక్టర్‌ పదవా...!? 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నిరుద్యోగుల మోసగించిన 'దేవానంద్‌'కు మళ్లీ డైరెక్టర్‌ పదవా...!?

టిడిపి ప్రభుత్వం చేసిన తప్పులను దిద్దుకోవడంలో ఘోరవైఫల్యం చెందుతోంది. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను అవినీతి, అక్రమాలను సహించనని పదే పదే చెబుతున్నా...ఆచరణలో మాత్రం దాన్ని పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అవినీతిపరులు, అక్రమార్కులను దూరంగా ఉంచాల్సిన పార్టీ..వారిని పదే పదే ప్రోత్సహిస్తూ..ప్రజల దృష్టిలో చులకన అవుతోంది. తాజాగా...ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న 'గుడెస దేవానంద్‌'ను మరోసారి డైరెక్టర్‌గా నియమించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  'దేవానంద్‌'పై అవినీతి,మహిళలను వేధింపులకు గురి చేశారనే ఆరోపణలు వస్తున్నా...మరోసారి ఆయనను ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా నియమించి ప్రభుత్వం అవినీతి పరులను, అక్రమార్కులను ప్రోత్సహిస్తామని నిర్లజ్జగా చెప్పుకున్నట్లైంది. 'దేవానంద్‌'  అవినీతి, అక్రమాల వ్యవహారాలు   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు  తెలుసో..తెలియదో..కానీ...ఆయన సలహాదారులు...ఇతర ముఖ్య అధికారులు.. మాత్రం ఇటువంటి వారిని ప్రోత్సహించడంలో..ముందుంటున్నారు.

నిరుద్యోగులను ముంచిన 'దేవానంద్‌'...!

ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో 'దేవానంద్‌' పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పది లక్షల రూపాయలు వసూలు చేసి...తరువాత తప్పించుకు తిరుగుతున్న వైనం తాజాగా బయటపడింది. ఈ విషయంలో బాధితులు...నిన్న కదిరి డిఎస్పీని కలసి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. తాము 'దేవానంద్‌'ను నమ్మి..లక్షల రూపాయలు అతని చేతిలో పెట్టామని...చివరకు దళితులమైన తమను అతను ఘోరంగా మోసం చేశారని...సాక్ష్యాలతో సహా రుజువులు చూపించారు. ఇవి రాజకీయ ఆరోపణలో...ఇతర విమర్శలో కాదు...! నేరుగా అవినీతికి సంబంధించి పక్కా సాక్ష్యాలు..అయినా..ప్రభుత్వ పెద్దలు...సీనియర్‌ అధికారులు...'దేవానంద్‌'నే... కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా నియమించారంటే... ప్రభుత్వం ఎటుపోతుందో...అర్థం కాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆది నుంచి వివాదాస్పదుడే...!

కదిరికి చెందిన 'దేవానంద్‌' ఆది నుంచి వివాదాస్పదుడే...అనే విమర్శలు ఉన్నాయి. టిడిపి అధికారంలోకి రాక ముందు..ఆయన బిజెపిలో ఉండేవారు. తరువాత టిడిపిలో చేరిన ఆయనకు కదిరికి చెందిన నియోజకవర్గ నేతతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో...ఆయన తన అనుచరుడికి ఎస్పీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవి ఇప్పించారు. దీంతో..'దేవానంద్‌' చెలరేగిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవి అడ్డుపెట్టుకుని...బినామీ పేర్లతో లోన్‌లు తీసుకుని ఎగవేశారనే విమర్శలు ఉన్నాయి. అంతే కాదు..ఎస్సీ కార్పొరేషన్‌కు వివిధ పనులపై వచ్చే మహిళలను లోబర్చుకున్నారనే మాట కూడా వినిపిస్తోంది. మహిళలకు రుణాలు ఇప్పిస్తానని మోసం చేశారని పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేయటం నిత్యకృత్యమైందని...ఇచ్చిన సొమ్ములు వెనక్కు ఇవ్వమని అడిగిన వారిని బెదిరిస్తున్నారని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. తాను అధికార పార్టీలో కీలకమైన నాయకుడనని...తనను ఎవరూ ఏమీ చేయలేరని...హుంకరిస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు, విమర్శలు ఉన్న వ్యక్తిని మరోసారి..కీలకమైన కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవిలో కూర్చోపెట్టి ప్రభుత్వం తన పరువును తానే తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా చేసిన తప్పులను ప్రభుత్వం సరి చేసుకోవాలని, అవినీతిపరులను, అక్రమార్కులను ప్రోత్సహించవద్దని...పలువురు కోరుతున్నారు. నిరుద్యోగులను మోసగించిన 'గుడిసె దేవానంద్‌'పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన బాధితులు కోరుతున్నారు.  

('దేవానంద్‌' బాధితుల గోడు వినండి https://www.youtube.com/embed/s7LhJEWtLEw)



(367)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ