WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పవన్‌' అభిమానుల పయనమెటు...!?

తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, ఓటర్లు అయిన కొందరు 'పవన్‌'ని బాగా అభిమానిస్తారు. 2014లో 'చంద్రబాబు' ముఖ్యమంత్రి కావడానికి 'పవన్‌' కూడా కొంత కారణమని వారి నమ్మకం. ప్రస్తుతం 'పవన్‌' అభిమానుల్లో ఆయన సామాజికవర్గానికి చెందిన విద్యార్థులు, సినీ అభిమానులు మాత్రమే మొగ్గుచూపుతున్నారని..మిగతా వారిలో ఎక్కువ మంది టిడిపికే మద్దతు ఇస్తారని 'కాపు' సామాజికవర్గ టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు 'పవన్‌'ను అభిమానిస్తూ...మరోవైపు టిడిపికి ఓటు వేసేవారు సుమారు 30శాతం మంది ఉంటారనేది వారి నమ్మకం. 'పవన్‌' చెప్పినా..చెప్పకపోయినా..వారు టిడిపికే ఓటు వేస్తారని...'జనసేన'కు ఓటు వేయరనేది వారి అభిప్రాయం. 'పవన్‌' అభిమానుల్లో కొందరు గత ఎన్నికల్లో బిజెపికి ఓటువేశారు. ఇప్పుడు ఆయనతో పొత్తు పెట్టుకున్నా..ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగినా..ఆ ఓటర్లు...వైకాపాకే మద్దతు ఇస్తారు కానీ...'పవన్‌'కు ఇవ్వరనేది ఆ పార్టీ నాయకుల నమ్మకం. కేవలం 20-25శాతం మంది అభిమానులు మాత్రమే 'పవన్‌' ఎటువైపు మొగ్గితే..అటువైపు మొగ్గుతారు. ప్రస్తుతం 'పవన్‌' అభిమానుల్లో ఎక్కువమంది గత ఎన్నికల్లో 60-70శాతం మంది టిడిపికి వ్యతిరేకంగా ఓటువేశారు. అందుకు తూర్పుగోదావరిజిల్లాలో వైకాపా అభ్యర్థులు గెలవడం నిదర్శనం. ఇటీవల కాలంలో 'పవన్‌' తొందరపడి..'చంద్రబాబు'పై ఆయన కుమారుడు 'లోకేష్‌'పై చేసిన విమర్శలు, ఆరోపణలు కాపుసామాజికవర్గ నేతలకు మింగుడుపడడం లేదు. మా వాడు ఎందుకు ఈ విధంగా బయటపడ్డారో తెలియడంలేదు. చంద్రబాబు పాలనలో 'కాపు'లకు పెద్దపీట వేస్తున్నారు. స్వతాగా 'జనసేన' అధికారంలోకి రావడం చాలా కష్టం...ఒకవేళ ఆయన వైకాపాతో పొత్తుపెట్టుకున్నా...తాము టిడిపికే ఓటు వేస్తామని పిలుపుఇస్తామని చెబుతున్నారు. నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులు 'పవన్‌'కు బ్రహ్మరథం పట్టి...ఆయనసినిమాలను ఆడించిన ఘనత ఉందని..తాజాగా ఆయన చేసిన విమర్శలపై రగిలిపోతున్నారని కాపు సామాజికవర్గానికి చెందిన నాయకులు చెబుతున్నారు. 

   'రాష్ట్రానికి అన్యాయం చేసిన 'మోడీ'పై విమర్శలు చేయకపోవడం, 'చంద్రబాబు,లోకేష్‌లను టార్గెట్‌గా చేసుకుని ఆరోపణలు చేయడం తటస్థ ఓటర్లలో ఆగ్రహానికి కారణమైంది. 'పవన్‌'ను సినిమా నటుడిగా ఆదరిస్తాం..కానీ..రాజకీయంగా ఆయన చెప్పినట్లు వినే ప్రసక్తేలేదని కొందరు అభిమానులు చెబుతున్నారు. కాపు కార్పొరేషన్‌ద్వారా ఇప్పటి వరకు 4వేల కోట్ల రూపాయలను ఆ సామాజికవర్గానికి ఇచ్చిందని..విద్యార్థులకు విద్య కోసం ఆర్థిక సహాయం చేసిందని, పవన్‌ అనేక సమస్యలపై స్పందించినప్పుడు..వెంటనే సిఎం చర్యలు తీసుకున్నారని...ఆయన సిఎంను కలసినప్పుడు దగ్గర ఉండి తీసుకెళ్లారని..మళ్లీ ఆయన వెళ్లేటప్పుడు..కారు వద్దకు ఎక్కించారని...ఏ ముఖ్యమంత్రి ఆయనకు ఆ గౌరవం ఇవ్వరని..'చంద్రబాబు'ను పోగొట్టుకోవడం బాధగా ఉందని..తాము మాత్రం టిడిపికే ఓటు వేస్తామని...ఇటీవల నిర్వహించిన సమావేశంలో మెజార్టీ వర్గాలు చెప్పాయి. చదువు సంధ్యలేని కొంత మంది అభిమానుల ముసుగులో ఉన్న ఓటర్లు, వారితో కలసిమెలసి ఉన్న ఇతర వర్గాలు..మాత్రమే బాహాటంగా వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు..కయ్యానికి కాలు దువ్వుతున్నారు. 

  ముద్రగడ పద్మనాభంతో..'పవన్‌' కలసిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు..'చంద్రబాబు'ను సిఎం గద్దె నుంచి దించడమే తన ఏకైక లక్ష్యమని..ముద్రగడ అనేకసార్లు బాహాటంగా విమర్శ చేశారు. తూర్పుగోదావరిలో చాలా మందికి ఇది మింగుడుపడడం లేదని వైకాపా నాయకులు కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు 'పవన్‌' ఇచ్చిన పిలుపు టిడిపికి తోడ్పడినప్పటికీ...అంతకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో పాటు..ఎంపిపి,జెడ్‌పిసిసి పదువులన్నీ టిడిపికే కట్టబెట్టారు ఓటర్లు. కేవలం పది నుంచి 20శాతం అభిమానులు చేసే హడావుడి తప్ప..మిగతా వారంతా..టిడిపికే ఓటు వేస్తారని..టిడిపి నాయకులు, మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 'పవన్‌' పిలుపును..ఆయన సామాజికవర్గ ఓటర్లు ఎంత వరకు అనుసరిస్తారో..లేక..అనేక సౌకర్యాలతోపాటు..మంత్రి పదవులు ఇతర పదవులు కట్టబెట్టిన 'చంద్రబాబు'ను వదులుకుంటారా..? అనే విషయం మరికొద్ది రోజుల్లో బయటకు రానుంది.

(285)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ