WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'లోకేష్‌' చుట్టూ...కులపంచాయితీలు...!

పంచాయితీరాజ్‌శాఖాధిపతి జవహర్‌రెడ్డిని బదిలీ చేస్తే...రెడ్డి సామాజికవర్గంలో ఆగ్రహం బయటపడి టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారట. 'జవహర్‌రెడ్డి' నిజాయితీగా,సమర్థవంతంగా పనిచేసినా చేయకపోయినా..ఆయన పేరుతో మధ్యవర్తులు లక్షలాది రూపాయలు అడ్వాన్స్‌ల రూపంలో తీసుకుని పరారు..అయినా...ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే కిందిస్థాయి అధికారి ఒకరు..ఒక గ్రూపును తయారు చేసి లంచాలు వసూలు చేయించినా...మంత్రి లోకేష్‌ దృష్టికి ఇవన్నీ వచ్చినా...'జవహర్‌రెడ్డి'పై ఈగ వాలనివ్వడం లేదు. దీనికి కారణం ఏమిటంటే ఆయన నోటి ద్వారానే బయటకు వచ్చింది. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి...అసలే రెడ్డి సామాజికవర్గం టిడిపిపై వ్యతిరేకతతో ఉంది. ఈ సమయంలో 'జవహర్‌రెడ్డి'ని బదిలీ చేస్తే...ఇబ్బందులు వస్తాయి...అని మంత్రి లోకేష్‌ ఊహించుకుని..అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తూ...ఇటు వ్యక్తిగతం విమర్శల పాలవుతున్నారు. 

  ఇది ఇలా ఉంటే..'చంద్రగిరి' నియోజకవర్గానికి చెందిన ఒక సీనియర్‌ కార్యకర్త...ఇటీవల మంత్రి లోకేష్‌ను కలసి పార్టీ అభిమానులు కానీ...మిమ్మలను, మీ తండ్రిని అభిమానించేవారు ఎవరూ మీ పేషిలో లేరు...ముఖ్యంగా..'కమ్మ' సామాజికవర్గానికి చెందిన వారిని 'లోకేష్‌' దూరం పెడుతున్నారు...ఒకరిద్దరిని కూడా కార్యాలయంలో నియమించుకోలేదు..అని చెప్పగా...దానిపై 'లోకేష్‌' స్పందిస్తూ...తన కార్యాలయంలో 'కమ్మ' సామాజికవర్గానికి చెందిన వారిని ఏ హోదాలోనూ నియమించుకోలేను...తనకు చెడ్డపేరు..వస్తుంది...మళ్లీ ఈ విషయం ప్రస్తావించవద్దు...అని కఠినంగా చెప్పారట. 'జవహర్‌రెడ్డి'ని బదిలీ చేస్తే...'రెడ్డి' సామాజికవర్గానికి ఆగ్రహం కలుగుతుంది. 'కమ్మ' వారిని నియమించుకుంటే చెడ్డపేరు వస్తుంది..ఇది ఒకప్పుడు ఆయన తండ్రి 'చంద్రబాబు' అనుసరించిన విధానం. తరువాత ఈ అభిప్రాయం తప్పు అని తెలుసుకుని.. కులాన్ని బట్టి కార్యాలయంలో ఎవరినీ నియమించుకోవద్దని, సమర్థత,నిజాయితీపరులను నియమించుకోవాలని నిర్ణయానికి వచ్చి...దాన్ని అమలు చేశారు 'చంద్రబాబు'. అప్పటికే ఆయనకు ఎన్నెన్నో అనుభవాలు జరిగాయి. 

   మంత్రి లోకేష్‌కు ఈ సలహా ఎవరు ఇచ్చారో...? అని ఆరా తీయగా...పార్టీ జాతీయ కార్యాలయ ఇన్‌ఛార్జి టి.జనార్థన్‌ ఈ సలహా ఇచ్చినట్లు బయటకు పొక్కింది. అప్పుడప్పుడు 'జవహర్‌రెడ్డి'ని స్వయంగా కలుస్తూ...'జనార్థన్‌' చాలా పనులు చక్కపెట్టుకున్నారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. పార్టీ కార్యాలయంలో ఉండే 'జనార్థన్‌'పై రాని వ్యతిరేకత మంత్రి లోకేష్‌ కార్యాలయంలో నియమించుకుంటే వస్తుందా...? అందుకేనేమో..త్వరలో మీ బదిలీ జరుగుతుందని..ఎవరైనా 'జవహర్‌రెడ్డి'ని కలసి అడిగితే...ఆయన నవ్వుతూ కొట్టిపారేస్తున్నారు. తనను ఈ పోస్టులోంచి ఎవరూ తప్పించలేరన్న ధీమాతోనే ఆయన నవ్వుతున్నారని వారు అంటున్నారు. లోకేష్‌ కులపరమైన నిర్ణయాలు ఇప్పుడిప్పుడు...బయటకు వస్తున్నాయి...దీనిపై ఆయా వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవన్నీ ఆయనకు నష్టం చేకూరుస్తాయో...లాభం తెచ్చిపెడతాయో..చూడాలి.

(174)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ