WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిటిడి ఇఒ 'సింఘాల్‌'కు భంగపాటు తప్పదా...!?

టిటిడికి చెందిన వెయ్యికోట్లను ప్రైవేట్‌ బ్యాంకుల్లో వేయడం దానిపై చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు హైకోర్టులో కేసు దాఖలు చేయడం దీనిపై కోర్టు స్పందించి అనేక ప్రశ్నలు వేసిన నేపథ్యంలో తిరుపతి,తిరుమలలో అటు ఉద్యోగులు, ఇతర వర్గాలు సంబరాలు చేసుకుంటున్నారు. హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన మరుసటి రోజు శ్రీవారి కాలిమెట్ల వద్దకు వెళ్లి కొబ్బరికాయలు కొట్టి..మీ ఆస్తులను మీరే కాపాడుకోవాలి స్వామీ అంటూ బాహాటంగా ప్రార్ధించారు. హైకోర్టు సంధించిన ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. శ్రీవారికి వడ్డీ ముఖ్యమా...? సొమ్ము భద్రత ముఖ్యామా..? ఆ ప్రైవేట్‌ బ్యాంకులు దివాలా తీస్తే...వెయ్యికోట్లకు బాధ్యులు ఎవరు..? పాలకమండలి కూడా లేదు...ఇటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వ అనుమతి ఉందా..? లేదా..? ఎక్కువ వడ్డీ ఇస్తామంటే..స్వామి వారి సొమ్మును షేర్‌మార్కెట్లలో..మ్యూచ్‌వల్‌ఫండ్స్‌లో కూడా డిపాజిట్‌ చేస్తారా..? అని హైకోర్టు ఆగ్రహంతో ప్రశ్నించింది. 

   కేవలం రెండు మూడు శాతం వడ్డీ అధికంగా కోడ్‌ చేసినందుకే ఇండిస్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయడం వెనుక అర్థం ఏమిటి..? దీనిపై నాలుగు వారాల్లో కౌంటర్‌ఫైల్‌ దాఖలు చేయాలని ఇఒను ఇతర అధికారులను కోర్టు ఆదేశించింది. అంతకు ముందు ముప్పయి సంవత్సరాలు ఉచితంగా సేవ చేసిన విజయాబ్యాంక్‌ తప్పించి..దానిలో ఉన్న డిపాజిట్లను ఆంధ్రాబ్యాంక్‌ డిపాజిట్‌ చేయటం పలు వివాదాలకు కారణమైంది. భక్తులకు శ్రీవారి దర్శనం, ఇతర సౌకర్యాల గురించి ఆలోచించాల్సిన అధికారులు...ఆ విషయంపై కాకుండా డిపాజిట్లపై దృష్టిసారించారనే విమర్శలు వస్తున్నాయి. జాతీయ బ్యాంక్‌లు మరియు కోపరేటివ్‌ బ్యాంక్‌లు మాత్రమే ప్రభుత్వ సొమ్మును డిపాజిట్‌ చేయాలని ప్రైవేట్‌ బ్యాంకుల్లో కానీ...కోపరేటివ్‌ అర్బన్‌బ్యాంక్‌ల్లో కానీ...ప్రభుత్వం డిపాజిట్‌లు చేయవద్దని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ముఖ్యమంత్రి చంద్రబాబు సవరించి కొన్ని ప్రైవేట్‌ బ్యాంక్‌ల్లో వేయమని చెప్పారని..ప్రచారం జరుగుతున్నా...అందుకు సంబంధించిన ఉత్తర్వులను పరిశీలించాల్సి ఉంటుంది. టిటిడి ఇఒ సింఘాల్‌, జెఇఒ శ్రీనివాసరాజు, భాస్కర్‌తో పాటు..ఫైనాన్స్‌ ఎడ్వజయిరీ బాలాజీ చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని....ఇందులో ఎవరెవరిపై ఒత్తిడి తెచ్చారో...బయటకు రావడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో ఇఒ సింఘాల్‌కు భంగపాటు తప్పదేమో..? భక్తులు ఇచ్చిన కానుకలను ప్రైవేట్‌ బ్యాంక్‌ల్లో వేయాల్సిన అవసరం సింఘాల్‌కు ఎందుకు వచ్చింది...? వడ్డీ ముఖ్యమా...? సొమ్ము భత్ర ముఖ్యామా..? అనే విషయం సింఘాల్‌కు తట్టలేదా..? ఇంతకు ముందు ఏ ఇఒ కూడా ఈ డిపాజిట్ల విషయంపై వేలు పెట్టలేదు. ప్రస్తుతం రెవిన్యూ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తోన్న సాంబశివరావు టిటిడి ఇఒగా పనిచేసినప్పుడు...ఆయనను డిపాజిట్లు అడిగేందుకు ప్రైవేట్‌ బ్యాంక్‌లు భయపడ్డాయి...ఆయనను కలసినప్పుడు ఆ విషయంపై చర్చించేందుకు జంకాయి. మరి సింఘాల్‌ ఎందుకు ఈ ఒత్తిడికి లొంగి ఇలా వ్యవహరించారనే విషయంపై విచారణ జరిపిస్తే...వెనుక ఉన్నవారు...ప్రలోభపెట్టిన వారిని విషయం బయటకు వస్తుంది. 

    ప్రైవేట్‌ బ్యాంక్‌లో వెయ్యి కోట్లు డిపాజిట్‌ చేసినందుకు వన్‌పర్సెంట్‌ కమీషన్‌ ఉంటుందని...టిటిడి ఉద్యోగులు చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా..? చివరకు కోర్టు కూడా ఈ డిపాజిట్‌ వ్యవహారంలో కలుగ చేసుకుని...పరిస్థితి ఎటుపోతుందని ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరో నాలుగు వారాల్లో..దీనిపై కోర్టు ఏ విధంగా స్పందించనుందో..చూడాల్సి ఉంది. అంతే కానీ..వేసిన డిపాజిట్లను వెనక్కు తీసుకుని..మళ్లీ జాతీయ బ్యాంక్‌ల్లో డిపాజిట్‌ చేస్తే..ఒకే..లేకపోతే..పాలకులకు.. టిటిడి ఉన్నతాధికారులకు భంగపాటు తప్పదు. 1980కు ముందు టిటిడి సొమ్మును ప్రభుత్వ ఖజానా వేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ ప్రభుత్వ హయాంలో ఉత్తర్వులు జారీ చేయగా..కోర్టులు కొట్టివేయడం జరిగింది. ఆ సొమ్ములు...ప్రజల నుంచి పన్నుల ద్వారానో...ఇతరత్రా రాలేదు...? శ్రీవారికి..భక్తులు ప్రేమతో..భక్తితో సమర్పించారని..ఈ సొమ్ములు ప్రభుత్వ ఖజానాకు ఎలా జమచేసుకుంటారని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వంపై నమ్మకం లేదా..? అంటూ ఎన్టీఆర్‌ ప్రశ్నించిన విషయం బయటకు రాగా...? ఆ విషయంపై కోర్టు స్పందిస్తూ...దేవునిపై భక్తితో..భక్తులు ఇఛ్చిన సొమ్మును ఖజానాకు చేరడానికి వీలు లేదని స్పష్టంగా చెప్పింది. ఏ ఒక్కరీనీ ఖాతరు చేయని దివంగత సిఎం రాజశేఖర్‌రెడ్డి కూడా ఈ విషయంపై వేలు పెట్టలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని అప్రదిష్టపాలైంది. మరో నెలరోజుల్లో...ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.

(228)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ