'విజయనగరం' జిల్లా కలెక్టర్‌గా 'హరికిరణ్‌'...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'విజయనగరం' జిల్లా కలెక్టర్‌గా 'హరికిరణ్‌'...!

విజయనగరం జిల్లా కలెక్టర్‌గా తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌ హరికిరణ్‌ను నియమించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ విషయం అనధికారికంగా బయటకు పొక్కింది.  ఈ విషయాన్ని తెలుసుకున్న 'హరికిరణ్‌' తనను విజయనగరం జిల్లా కలెక్టర్‌గా నియమించబోతున్నారని సన్నిహితవర్గాలకు తెలిపారట. ఒక సమయంలో 'కడప' జిల్లా కలెక్టర్‌గా నియమించబోతున్నట్లు అధికారవర్గాలు చెప్పగా...అక్కడి నాయకులతో తాను వేగలేనని, గ్రూపు రాజకీయాలతో పాటు...ప్రతిపక్షనేత 'జగన్‌' స్వంత జిల్లా కూడా కావడంతో...పలు ఇబ్బందులు వస్తాయని అధికారపార్టీ నాయకులకు ఆయన తెలిపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. హరికిరణ్‌ను 'విజయనగరం' జిల్లా కలెక్టర్‌గా నియమిస్తే...ఆయన స్థానంలో రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌ జి.విజయరామరాజును నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 'విజయరామరాజు' ఉన్నతాధికారులను కలసి తమ అభిమతం చెప్పారని తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో 'విజయనగరం' జిల్లా కలెక్టర్‌గా 'హరికిరణ్‌'ను నియమిస్తారని...మిగతా జిల్లా కలెక్టర్ల బదిలీలతో ఇది ముడిపడి ఉంటుందని తెలుస్తోంది. చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన బదిలీల ఉత్తర్వులు..ఆ జిల్లా ఉద్యోగులకు ఎన్నికలకోడ్‌ అడ్డంకిగా మారింది.

(246)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ