WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఐవైఆర్‌' లేఖతోనే...టిటిడిపై కేంద్రం కుట్ర....!

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రం ఆధీనంలో తీసుకోవడానికి చేస్తోన్న ప్రయత్నాల వెనుక మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఒక పథకం ప్రకారం టిటిడిపై కుట్రలు చేస్తున్నారని...గతంలోనే ఆయన టిటిడిని కేంద్రానికి అప్పగించడానికి ప్రయత్నాలు చేశారని...అప్పట్లో అది వల్లకాకపోవడంతో..తాజాగా బిజెపి అండతో మరోసారి టిటిడిని కేంద్రం చేతిలో పెట్టాలని ఆయన కుట్రలు చేస్తున్నారని పలువర్గాలు విమర్శిస్తున్నాయి. ఆయన టిటిడి ఇఒగా ఉన్నప్పుడు వారసత్వ కట్టడాల పరిరక్షణ పేరుతో..తిరుమల ప్రధాన దేవాలయంతో పాటు..ఏడు ఇతర దేవాలయాలను కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ స్వాధీనం చేసుకోవాలని లేఖలు రాశారు. దీన్ని అప్పటి పాలకమండలి తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పట్లో..ఈ ప్రతిపాదన మూలన పడడంతో..తాజాగా.. మరోసారి..ఈ విషయాన్ని కేంద్రానికి ఆయన చెప్పారని..దాంతో...కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం టిటిడిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. కేంద్రం నుంచి టిటిడికి దానికి సంబంధించిన లేఖ రావడంతో ప్రజలు, వివిధ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో..వారు ఆ లేఖను వెనక్కు తీసుకున్నారు. ప్రస్తుతానికి కేంద్రం వెనకడుగు వేసినా..రాబోయే రోజుల్లో దీనిపై మరోసారి కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చు. మొత్తానికి టిటిడిని కేంద్రం ఆధీనంలోకి తీసుకెళ్లాలనే ఐవైఆర్‌ కుట్ర ఫలిస్తుందా..? లేదా..అనేది త్వరలో తేలిపోనుంది.


(129)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ