21మంది ఐఎఎస్‌ అధికారుల బదిలీ...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

21మంది ఐఎఎస్‌ అధికారుల బదిలీ...!

రాష్ట్ర ప్రభుత్వం 21మంది సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో పలువురు శాఖాధిపతులు కూడా ఉన్నారు. మైనార్టీ వెల్ఫేర్‌ కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్‌ను జిఎడికి బదిలీ చేసింది. ఇటీవల కాలంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి కె.రామ్‌గోపాల్‌కు మైనార్టీ వెల్ఫేర్‌శాఖను అప్పగించింది. పియూష్‌కుమార్‌కు ఫైనాన్స్‌ సెక్రటరీగా నియమించింది. ఎపిఎస్‌సి వైస్‌ ఛైర్మన్‌ మరియు ఎండిగా జి.ఎస్‌.ఆర్‌.కె.ఆర్‌.విజయకుమార్‌ను సిసిఎల్‌ఎగా బదిలీ చేసింది. 2005వ బ్యాచ్‌కు చెందిన హర్షవర్థన్‌ను విద్యాశాఖకార్యదర్శిగా నియమించింది. ఆయన గతంలో ఎపిబిసి కార్పొరేషన్‌ వైస్‌ఛైర్మన్‌గా ఉండేవారు.వ్యవసాయశాఖ కమీషనర్‌గా ఉన్న హరిజవహర్‌లాల్‌ను విజయనగరం కలెక్టర్‌గా నియమించింది. గతంలో కలెక్టర్‌గా ఉన్న వివేక్‌యాదవ్‌ను బదిలీ చేసింది. కడప కలెక్టర్‌గా ఉన్న టి.బాబూరావు నాయుడును బదిలీ చేశారు. ఆయనను జిసిసి కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించింది. స్వచ్చకార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉన్న డి.మురళీధర్‌రెడ్డిని వ్యవసాయశాఖ కమీషనర్‌గా బదిలీ చేసింది. విజయనగరం కలెక్టర్‌గా ఉన్న వివేక్‌యాదవ్‌ను ఎస్పీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. భూ పరిపాలన కమీషనర్‌గా ఉన్న బి.రామారావును ఎపిబిసి కార్పొరేషన్‌ ఎండిగా బదిలీ అయ్యారు. తిరుపతి మున్సపల్‌ కార్పొరేషన్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఉన్న చెవురు హరికిరణ్‌ను 'కడప' కలెక్టర్‌గా నియమించింది. పశ్చిమగోదావరి జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తోన్న పి.కోటేశ్వరరావును ఎపిపిఎస్‌సి కార్యదర్శిగా బదిలీ చేశారు. అనంతపురం జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తోన్న టి.కె.రామమణిని కమర్షియల్‌ ట్యాక్స్‌కు బదిలీ చేశారు. సి.నాగరాణిని కడప జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నియమించారు. 

  రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌గా ఉన్న విజయరామరాజును తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (తుడా) వైస్‌ ఛైర్మన్‌గానియమించారు. పోస్టింగ్‌ కోసం చూస్తోన్న ఎం.వెంకటేశ్వర్లును ఎపిహ్యాండీక్రాప్ట్‌ ఎండిగా నియమించారు.  వేణుగోపాల్‌రెడ్డిని పశ్చిమగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన గతంలో ఎనర్జీ డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు. వెంకటరమణారెడ్డిని విజయనగరం జాయింట్‌ కలెక్టర్‌గా నియమించారు.  ప్రకాశం జిల్లా డిఆర్‌ఒగా పనిచేస్తోన్న ఎన్‌.ప్రభాకర్‌రెడ్డిని భూపరిపాలనశాఖ జాయింట్‌ సెక్రటరీగా నియమించారు. నెల్లూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ వైస్‌ ఛైర్మన్‌గా పనిచేస్తున్న ఎస్‌.ఢిల్లీరావును అనంతపురం జాయింట్‌ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. నర్సాపురం సబ్‌ కలెక్టర్‌గా పనిచేస్తోన్న సుమిత్‌కుమార్‌ను రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌గా నియమించారు. మొత్తం 21మంది ఐఎఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేయగా వీరిలో ఇద్దరు కలెక్టర్లు..ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లు, పలువురుశాఖాధిపతులు ఉన్నారు.


(489)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ