WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అబ్బా...'భాస్కర్‌' బదిలీ కాలేదా...!?

విశాఖ,పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లు అక్కడే మూడేళ్ల నుంచి పనిచేస్తుండడంతో..వారిని బదిలీ చేయాలని సిఎం భావించినా ఆఖరు నిమిషంలో ఆగిపోయింది. ఆ రెండు జిల్లాల కలెక్టర్ల పనితీరుపై సిఎం వివిధ వేదికలపై ప్రశంసలు కురిపించారు. మూడేళ్లు పాటు బాధ్యతలు నిర్వహించిన వారందరినీ బదిలీ చేయాలని అధికారులు సూచించినప్పటికీ..వారిని మరో రెండు,మూడు నెలల తరువాత బదిలీ చేయవచ్చునని ముఖ్యమంత్రి దాటవేశారట. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌, విశాఖపట్నం కలెక్టర్‌ ప్రవీణ్‌లు సిఎం సూచించన పనులను ఆగమేఘాలపై చేసి ప్రభుత్వ ప్రతిష్టను పెంచారని, వారిద్దరిని సిఎం ప్రత్యేకంగా చూస్తుంటారని పేరుంది. ఈ ఇద్దరు అధికారులు తమను బదిలీ చేయడం ఖాయమని, ప్రవీణ్‌ కుమార్‌ను పశ్చిమగోదావరికి, భాస్కర్‌ను విశాఖపట్నంకు బదిలీ చేస్తారని ఆ రెండు జిల్లాల అధికార వర్గాలు భావించాయి. ఈ ఇద్దరు అధికారులు కూడా క్రింది స్థాయి అధికారులకు ఈ విషయాన్ని చెప్పారు. 

  పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ 'భాస్కర్‌' బదిలీ అవుతారని ప్రచారం జరిగిన నేపథ్యంలో అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆనందాన్ని వ్యక్తం చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కలెక్టర్‌ను బదిలీ చేయాలని తానే సూచించానని అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని మంత్రి పీతాని సత్యనారాయణ డాంబికాలు పలికినా..ఆఖరు నిమిషంలో పరిస్థితి తారుమారైంది. విశాఖపట్నం కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను బదిలీ చేయాలని కానీ...అక్కడే కొనసాగించాలని కానీ...అక్కడి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ కోరలేదు. భాస్కర్‌ బదిలీ అవుతున్నారని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయనను ప్రజాప్రతినిధులు కలసి...'సార్‌..మీ పనితీరు వల్ల ప్రభుత్వ ప్రతిష్ట బాగా పెరిగింది..మరి కొంత కాలం మీరు ఇక్కడే పనిచేయాలి...అవసరమైతే..సిఎంపై ఒత్తిడి తెస్తామని అన్నారట. లోపల ఆవిధంగా చెప్పిన ప్రజాప్రతినిధులు...'కలెక్టర్‌ బదిలీ అవుతున్నారు..ఇక మన పని మనం చేసుకోవచ్చునని' చెప్పుకున్నారట. మరి కొంత మంది కలెక్టర్లను ,శాఖాధిపతులను కూడా బదిలీ చేస్తారని ప్రచారం జరిగినా చివరకు ఇద్దరు కలెక్టర్లను మాత్రమే బదిలీ చేసి..మరో రెండు నెలలు గడిచిన తరువాత అధికార వ్యవస్థను ప్రక్షాళన చేస్తారనేది అధికార వర్గాల సమాచారం.

(356)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ