WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సంక్షేమానికి ప్రాధాన్యం...!

విడిపోయిన తరువాత ఎన్ని కష్టాలు వచ్చినా..ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే..మరోవైపు...అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనపై దృష్టి పెట్టామని తెలిపారు. రాష్ట్రానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఫించన్‌ను ఐదు రెట్లు పెంచామని..దీనిపై వందశాతం సంతృప్తి వస్తోందన్నారు. 46లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని..రాబోయే రెండు మూడు నెలల్లో మరో ఐదు లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తామని సిఎం తెలిపారు. 

  అదే విధంగా పబ్లిక్‌ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్‌ బాగా పనిచేస్తుందని, ఆహారభద్రత కింద 4కేజీల నుంచి 5కేజీలకు పెంచామని, సంక్రాంతి, రంజాన్‌, క్రిస్టమస్‌ వంటి పర్వదినాలకు వారికి కావాల్సిన సరుకులు,ఇతరాలను అందిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెక్కరపై సెస్స్‌ పెంచిందని..అయినా..రాష్ట్ర ప్రభుత్వమే స్వంతంగా సెస్స్‌ను భరించి పేదలకు సరఫరా చేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. చంద్రన్నభీమాతో పేదలను ఆదుకుంటున్నామని, కుటుంబానికి పెద్ద అయిన వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే...ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తున్నామని, తీవ్రంగా గాయపడితే..రెండు లక్షల రూపాయలు ఇస్తున్నామని..ఇదో రికార్డు అని ఆయన చెప్పారు. గతంలో ఎవరూ ఈ విధంగా చేయలేదని...చంద్రన్నభీమా వయస్సు పరిమితిని 50సంవత్సరాలలోపు వారికి కూడా వర్తించేవిధంగా సవరణలు చేస్తున్నామని తెలిపారు. చంద్రన్నభీమా సొమ్మును సకాలంలో అందిస్తున్నామని, కేవలం పదిరోజుల్లో బాధితులకు సహాయం అందుతుందని తెలిపారు అదేవిధంగా పేదలకు పెళ్లికానుక అందిస్తున్నామని, పేదలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆన్‌లైన్‌లో సహాయం కోసం ధరఖాస్తు చేసుకోవచ్చని...ధరఖాస్తు అందిన వెంటనే పెళ్లి ఖర్చుల కింద 20శాతం ముందుగానే చెల్లిస్తున్నామని మిగతా 80శాతం పెళ్లిరోజు ఇస్తున్నామని సిఎం చెప్పారు. 

   పేదలకు 75యూనిట్లు వరకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తున్నామని, విద్యుత్‌ ఛార్జీలను పెంచేది లేదని చెప్పిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని ఆయన తెలిపారు. నరేగా ద్వారా రోజుకు రూ.206/-లను పనికిఆహారపథకం కింద చెల్లిస్తున్నామని, అదే సమయంలో వంద పనిరోజులు కల్పిస్తున్నామని తెలిపారు. నరేగా కింద పంచాయితీలకు రోడ్లను వేస్తున్నామని తెలిపారు, నిరుద్యోగులకు నిరుద్యోగభృతి అందిస్తున్నామని, అన్నక్యాంటీన్‌లు త్వరలో మొదలవుతాయని చెప్పారు. పంచాయితీల్లో వందశాతం సీసీరోడ్లు నిర్మించామని, అదే విధంగా ఎల్‌ఇడి బల్పులు అమర్చామని చెప్పారు. రాష్ట్రంలోని గ్రామాలన్నింటికి వందశాతం విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని, వ్యవసాయానికి కూడా వందశాతం విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి గ్యాస్‌ సరఫరా చేస్తున్నామని, ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా 15ఎంబీబీఎస్‌ ఇంటర్‌నెట్‌ ఇస్తున్నామన్నారు. అర్బన్‌ ఏరియాలో వందశాతం ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఓడిఎఫ్‌ను 80శాతం వరకు పూర్తి చేశామని..రాబోయే రోజుల్లో మిగిలిన 20శాతం పూరించి...వచ్చే నెల నుంచి ఓడిఎఫ్‌ ప్లస్‌కు వెళ్లాలని ముఖ్యమంత్రి చెప్పారు.

(77)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ