2022నాటికి దేశంలో నెంబర్‌వన్‌ స్థానమే లక్ష్యం:చంద్రబాబు 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

2022నాటికి దేశంలో నెంబర్‌వన్‌ స్థానమే లక్ష్యం:చంద్రబాబు

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 16వేల కిలోమీటర్ల సీసీరోడ్లు నిర్మించామని ఇదో రికార్డు అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మరో మూడు వేల కిలోమీటర్ల రోడ్లు వేయబోతున్నామన్నారు. 2161 స్వేర్‌హెక్టార్లలో పచ్చదనాన్ని పెంచామని చెప్పారు. పంచాయితీల్లో స్కూల్‌బిల్డింగ్స్‌, స్మశానవాటికలు, పంచాయితీభవనాలు, అంగన్‌వాడీ భవనాలు నిర్మించామని తెలిపారు. 2014-15 సంవత్సరంలో గ్రోత్‌రేటు 9.20శాతం ఉందని 15-16లో 10.60శాతం, 16-17లో 11.07శాతం, 17-18లో 11.22శాతం అభివృద్ధి సాధించామని సిఎం తెలిపారు. అదే సమయంలో భారతదేశ గ్రోత్‌రేటు 6.06శాతానికి పరిమితమైందని..దీని ద్వారా రాష్ట్రం ఎలా అభివృద్ధిపథంలో పయనిస్తుందో తెలుసుకోవచ్చన్నారు. 10.5శాతం గ్రోత్‌రేటుతో అభివృద్ధి చెందే రాష్ట్రాలు చాలా తక్కువ ఉన్నాయని..ఆయన అన్నారు. 

  అభివృద్ధి చెందిన రాష్ట్రాలైన హర్యానా, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌, తెలంగాణల్లో ఈ విధమైన అభివృద్ధి రేటు లేదని సిఎం తెలిపారు. 2022 నాటికి దేశంలో నెంబర్‌వన్‌ రాష్ట్రాంగా తయారు చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. వ్యవసాయ రంగంలో సుస్థిరమైన అభివృద్ధిని సాధిస్తున్నామని, అదే విధంగా ఆక్వా కల్చర్‌లో నూ అభివృద్ధి సాధిస్తున్నామని...దీని విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది పట్టిసీమ నుంచి 130టిఎంసీలు నీరు కృష్ణాకు తరలించామని, వచ్చే ఏడాది 200 టిఎంసీల నీరు కృష్ణాకు వస్తుందని..దీని ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీటి సమస్య తీరుతుందన్నారు. అదేవిధంగా నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెంపొందించామని 2.4శాతం భూగర్భజలాలు పెరిగాయని, దీని వల్ల దాదాపు రూ.500కోట్లు విద్యుత్‌శాఖకు లాభం చేకూరిందన్నారు.

(146)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ