WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఓటుకు నోటు'తో కాంగ్రెస్‌కే లాభం...!

రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. రాజకీయాల్లో వన్‌ప్లస్‌ వన్‌ ఎప్పుడూ రెండు కాదు...అనేది రాజకీయ విశ్లేషకుల మాట. తాజాగా ఓటుకు నోటు కేసు విషయం దాన్నే రుజవు చేస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మూడేళ్ల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్‌ ఎమ్మెల్యేను తమ పార్టీకి ఓటు వేయించుకునేందుకు నోట్లు ఇచ్చారని..దానిలో అప్పటి టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రధాన పాత్రదారుడని...ఆయనతో ఈ పనిచేయింది...ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేసు దాఖలు చేసింది. అప్పట్లో ఈ కేసుపై పెద్ద ఎత్తున్న దుమారం రేగింది. కెసిఆర్‌ ప్రభుత్వం తనపై కేసు పెట్టడంతో..తన ఫోన్‌ ట్యాప్‌ చేశారని...చంద్రబాబు' కూడా కేసు పెట్టారు. ఇరువర్గాలు తీవ్రస్థాయిలో తలపడ్డాయి. అయితే అప్పట్లో ఇద్దరికీ కావాల్సిన ఢిల్లీ నేత ఇరువురిని సముదాయించి...సఖ్యత కుదిర్చారు. అయితే అనూహ్యంగా నిన్న,మొన్న తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఓటుకు నోటు కేసుపై సమీక్ష నిర్వహిస్తున్నానని లీకులు ఇస్తున్నారు. ఈ కేసును బయటకు తీయాలని కేంద్రంలోని బిజెపి పెద్దలు కెసిఆర్‌ను ఆదేశించారని..దాంతో...ఎక్కడో ఉన్న ఈ కేసును ఆగమేఘాలపై బయటకు తెచ్చి..'చంద్రబాబు'ను జైలుకు పంపుతామని కెసిఆర్‌ హుంకరిస్తున్నారు. కేసు సంగతి ఎలా ఉన్నా...ఇక్కడ మాత్రం ఈ కేసును బయటకు తీసి...'చంద్రబాబు'ను ఇబ్బంది పెడితే..రాజకీయంగా కెసిఆర్‌కు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

  'చంద్రబాబు'కు సమస్యలు సృష్టించడానికే...ఇప్పుడు ఈ కేసును బయటకు తెస్తే...తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సెటిలర్స్‌...కెసిఆర్‌ను రాజకీయంగా సమాధి చేస్తారని వారు అంటున్నారు. గత నాలుగేళ్ల నుంచి...సెటిలర్స్‌ కెసిఆర్‌కు అనుకూలంగా ఉన్నారు. విభజనకు ముందు కెసిఆర్‌ను వారు వ్యతిరేకించినా..విభజన తరువాత..మాత్రం వారు..కెసిఆర్‌వైపే ఉంటున్నారు. జిఎంసిహెచ్‌ ఎన్నికల్లోనూ ఈ విషయం నిరూపితమైంది. అయితే అప్పటి నుంచి కొనసాగుతున్న సఖ్యత ఇటీవల కాలంలో లేదని...ఆ వర్గాలు అంటున్నాయి. ఆంధ్రాకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా... బిజెపి పెద్దలు...మోసం చేస్తే...దాన్ని పార్లమెంట్‌లో టిడిపి ఇతర పార్టీలు అవిశ్వాసం పెడితే..దాన్ని కెసిఆర్‌ అడ్డుకున్నారనే కోపం సెటిలర్స్‌లో ఉంది. అంతే కాకుండా గత నాలుగేళ్లుగా అస్తవ్యస్థ పాలనతో...దేశ ప్రజలకు అసంతృప్తికి కారణమైన బిజెపితో కెసిఆర్‌ చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరుగుతున్నారనే అసంతృప్తి కూడా వారిలో ఉంది. ఇవన్నీ ఒకెత్తు అయితే...తాజాగా... 'చంద్రబాబు'పై ఓటుకు నోటు కేసు తిరగదోడి...ఆయనను ఇబ్బందులు పాలు చేయాలన్న కెసిఆర్‌ నిర్ణయంపై వారు మండిపడుతున్నారు. ఇప్పుడా కేసులో ఏ మాత్రం 'చంద్రబాబు'కు ఇబ్బందులు వచ్చినా..సెటిలర్స్‌ రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మారడం ఖాయం. ఇప్పటిదాకా...సెటిలర్స్‌కు చెందిన సామాజికవర్గాల పెద్దలను బుట్టలో వేసుకుని...టిఆర్‌ఎస్‌తో టిడిపి పొత్తు పెట్టుకుంటుందని...లీకులు ఇచ్చి..వారిని తనవైపు తిప్పుకున్న కెసిఆర్‌..తాజాగా...ఈ కేసును బయటకు తీస్తే..మాత్రం వారి నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతే కాకుండా...వారందరినీ..కాంగ్రెస్‌వైపు వెళ్లడానికి దోహదం చేసిన వారవుతారనడంలోనూ ఎటువంటి అనుమానం లేదు. ఇప్పటికే తీవ్రమైన ప్రజావ్యతిరేక ఎదుర్కొంటున్న కెసిఆర్‌..సెటిలర్స్‌ను దూరం చేసుకుంటే...కాంగ్రెస్‌కు అధికారం పల్లెంలో పెట్టి అప్పగిస్తారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. మరి కెసిఆర్‌ ఏం చేస్తారో..చూడాలి. ఏతా వాతా...ఓటుకు నోటు కేసును బయటకు తీస్తే..దాని ఫలాలు కాంగ్రెస్‌కు అందుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.


(359)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ