WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఈ-ఆఫీస్‌లోనూ...కృష్ణానే నెంబర్‌వన్‌...!

పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో నెంబర్‌వన్‌గా నిలిచిన కృష్ణా జిల్లా ఇప్పుడు మరో ఘనత సాధించింది.  ఈ-ఆఫీస్‌ ఫైళ్ల పరిష్కారంలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. మే2 నుంచి మే 8వరకు జిఎడి పరిపాలనా లెక్కల ప్రకారం కృష్ణా జిల్లా 9835 ఫైళ్లను పరిష్కరించి మొత్తం వందశాతం పరిష్కారంతో మొదటి స్థానాన్ని సాధించింది. కృష్ణా తరువాత స్థానాన్ని పశ్చిమగోదావరి జిల్లా సాధించింది. 8713 ఈ-ఫైళ్లకు కాను..7421 ఫైళ్ల ను పరిష్కరించి...పశ్చిమగోదావరి 85శాతంతో రెండోస్థానాన్ని పొందింది.  8162 ఫైళ్లలో 2261 ఫైళ్లను పరిష్కరించి 28శాతంతో విజయనగరం జిల్లా మూడో స్థానాన్ని సాధించింది. మిగితా జిల్లాల కలెక్టర్లు ఈ-ఆఫీస్‌లో చాలా దూరంగా ఉన్నారు. కనీసం పది శాతాన్ని కూడా ఐదు జిల్లాలు సాధించలేదు. అనంతపురం 6శాతం, చిత్తూరు 9శాతం,నెల్లూరు 8శాతం, గుంటూరు 7శాతం,శ్రీకాకుళం 8శాతంతో ఈ-ఫైళ్ల పరిష్కారంలో వెనుకబడి ఉన్నాయి. విశాఖపట్నం 14శాతం, తూర్పుగోదావరి 16శాతం,ప్రకాశం 14శాతం,కడప 11శాతం,కర్నూలు 12శాతం ఈ-ఆఫీస్‌తో ఫైళ్లను పరిష్కరిస్తున్నట్లు జిఎడి శాఖ ప్రకటించింది.

ఈ-తపాల్‌లోనూ..కృష్ణానే...!

ఈ-తపాల్‌లోనూ కృష్ణా జిల్లానే మొదటి స్థానం సాధించింది. మొత్తం 11299 ఈ-తపాల్‌లో 9471 పరిష్కరించి 84శాతంతో కృష్ణా తొలిస్థానంలో ఉండగా...68శాతంతో పశ్చిమగోదావరి రెండో స్థానంలో ఉంది. తూర్పుగోదావరి 19శాతంతో మూడో స్థానంలో ఉండగా..మిగతా జిల్లాలన్నీ కూడా దాన్ని అనుసరిస్తున్నాయి. వీటిలో కూడా కనీసం నాలుగు జిల్లాలు ఒకటే అంకెకు పరిమితమయ్యాయి. మొత్తం మీద..ఈ-ఆఫీస్‌, ఈ-తపాలాలో కృష్ణా,పశ్చిమగోదావరి జిల్లాలు ముందంజలో ఉన్నాయి.

(135)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ