ఐఏఎస్‌ బదిలీల్లో వై.ఎస్‌ అభిమానులకు పెద్దపీట...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఐఏఎస్‌ బదిలీల్లో వై.ఎస్‌ అభిమానులకు పెద్దపీట...!

ఇటీవల జరిగిన ఐఎఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల్లో కాంగ్రెస్‌ హయాంలో చంద్రబాబు సానుభూతిపరులైన అధికారులను తెరవెనుక ఉండి ఇబ్బందులు పెట్టిన అధికారులకే ఇప్పుడు కీలకపోస్టులు లభించడం పట్ల...అప్పట్లో ఇబ్బంది పడిన అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీ.శే.వై.ఎస్‌ హయాంలో...ఎపిఐసిసి ఎండి బి.పి.ఆచార్య బాధ్యతలు నిర్వహించినప్పుడు జరిగిన భూ కేటాయింపులు వల్ల చివరకు ఆయన జైలుకే వెళ్లాల్సి వచ్చింది. అదే సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు మురళీధర్‌రెడ్డి ప్రమేయం ఉందని..బయటకు పొక్కినా...ఆయనను సీబీఐ అధికారులు వదిలేశారు. ఆయన వై.ఎస్‌.కుటుంబానికి వీరాభిమానిగా పేరుంది. అందుకేనేమో..'మురళీధర్‌రెడ్డి'ని అత్యంత ప్రాధాన్యత గల వ్యవసాయశాఖకు డైరెక్టర్‌గా నియమించి వై.ఎస్‌పై ఉన్న అభిమానాన్ని చంద్రబాబు చాటుకున్నారేమోనని పలువురు వ్యంగ్యంగా అంటున్నారు. అంతే కాకుండా స్వచ్చాంధకార్పొరేషన్‌లో జరిగిన అవినీతికి 'మురళీధర్‌రెడ్డి' కారణమనే విమర్శలు ఉన్నాయి. 

  అదే విధంగా జాయింట్‌ కలెక్టర్ల నియామకంలో టిడిపి వ్యతిరేకులకు పెద్దపీట వేశారని, ఈవిషయంలో సిఎంఒ అధికారి 'సతీష్‌చంద్ర' మెతకవైఖరి అవలంభించారనే విమర్శలు వస్తున్నాయి. ఎంతో రాజకీయ, అధికార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పుటడుగులు వేస్తున్నారు. వ్యవసాయశాఖ మంత్రిగా 'సోమిరెడ్డి' బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆశాఖ డైరెక్టర్‌గా 'మురళీధర్‌రెడ్డి'ని ఎలా నియమిస్తారు..? పలు జిల్లాల జాయింట్‌ కలెక్టర్లగా నియమించిన వారిపట్ల ఆయా జిల్లాల కలెక్టర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమను సమర్థవంతంగా, నిజాయితీగా పనిచేయమంటున్నారు..కానీ..జాయింట్‌ కలెక్టర్ల నియామకంలో తమను సంప్రదించకుండా...పోస్టింగ్‌లు ఇచ్చారని..ఈ విధంగా చేస్తే..తాము ఎలా సమర్థవంతంగా పనిచేస్తామని ఒక జిల్లా కలెక్టర్‌ ఒక ముఖ్యఅధికారి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచనలకు, సిఫార్సులకు సిఎంఒ అధికారి 'సతీష్‌చంద్ర' అడ్డుపడ్డారని సచివాలయంలో ప్రచారం జరుగుతోంది.

(362)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ