WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

లోకేష్‌,చంద్రబాబులు ఆ సలహాను ఎలా స్వీకరించారు..?

గ్రామాల కార్యదర్శులుగా బాధ్యతలునిర్వహిస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఆయా పంచాయితీల పరిధిలో నివాసం ఉండకుండా సమీపంలో ఉన్న పట్టణాల్లో నివాసం ఉంటూ..ప్రజల కష్టాలను పట్టించుకోకుండా మొహం చాటేస్తున్నారని, ప్రభుత్వ దృష్టికి రావడంతో ప్రతి పంచాయితీ కార్యదర్శి అదే గ్రామంలో నివాసం ఉండాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయడం, ఆ ఆదేశాలు కాగితాలకే పరిమితం కావడం జరిగింది. అసలే కార్యదర్శులు కొరతగా ఉన్నారు. కొన్ని జిల్లాల్లో సగం మంది కార్యదర్శులు లేరంటే...అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో స్పష్టం అవుతోంది. ఒక్కో కార్యదర్శి రెండు, మూడు పంచాయితీలకు ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పి అధికారులు చేతులు దులుపుకుంటుడగా ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల పంచాయితీ కార్యదర్శులను ఔట్‌సోర్సింగ్‌ ద్వారా నియమిస్తామని ఆ శాఖ మంత్రి నారా లోకేష్‌ అట్టహాసంగా ప్రకటించారు. పంచాయితీ కార్యదర్శులను ఔట్‌సోర్సింగ్‌ పద్దతుల ద్వారా ఏకమొత్తం మీద జీతంపై నియమిస్తే..వారు ఎలా బాధ్యతగా పనిచేయగలుగుతారు..? కేవలం వారిని ఒక సంవత్సరం పాటు నియమిస్తే...ఆ తరువాత వారి సర్వీసును పొడిగిస్తామని చెబుతున్నారు..తప్ప..గ్రామానికి కీలకమైన పంచాయితీ కార్యదర్శి ఈ విధంగా నియమిస్తే...ఆయన ఒక్కసారిగా ఎవరికీ కనిపించకుండా మాయమైతే పరిస్థితి ఏమిటి..? బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగులైతే తమ ఉద్యోగాలను నిలబెట్టుకునేందుకైనా తప్పనిసరిగా బాధ్యతలు నిర్వహిస్తారు. 

   పంచాయితీ కార్యదర్శులను అవుట్‌సోర్సింగ్‌ ద్వారా నియమించాలని సలహా ఇచ్చిందెవరు...? ఆ సలహాను మంత్రి నారా లోకేష్‌ ఎలా అంగీకరించారు..? సరే...ఆయన అంగీకరిస్తే...అపార అనుభవం ఉన్న...సిఎం చంద్రబాబు ఎలా ఆమోదించారు..? ఏదో విధంగా పంచాయితీ నిధులను..ఔట్‌సోర్సింగ్‌ ద్వారా నియమితులైన కార్యదర్శి దిగమింగితేనో..లేక దుర్వినియోగం చేస్తేనే..బాధ్యులు ఎవరు..? ఆ నిధులను మళ్లీ ఎలా తేగలుగుతారు. ఆ పోస్టింగ్‌కు కావాల్సిన అర్హతలు ఉన్నవారిని నియమిస్తే..ఫర్వాలేదు...ఉన్నతార్హత ఉన్నవారిని మెరిట్‌ ప్రకారం ఎంపిక చేస్తే..వారు కొద్దిరోజుల పాటు బాధ్యతలు నిర్వహించి తప్పుకుంటే పరిస్థితి ఏమిటి..? పంచాయితీ కార్యదర్శులను ఔట్‌సోర్సింగ్‌ ద్వారా నియమిస్తే..పంచాయితీ భద్రతగా ఉంటుందా..? ఏమి చేయాలో పాలుపోవడంలేదని పలువురు కలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.

(167)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ