WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వర్ల రామయ్య'లో పోలీసు బుద్ది పోలేదా...!?

కొందరు రాజకీయ నాయకులు ఎదిగే కొంది ఒదిగి ఉంటారు. పదిమందితో మంచి అనిపించుకుని...రాజకీయంగా ఇంకా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తారు...అందరినీ..కలుపుగోలుగా పలకరించి....వ్యక్తిగత పేరును, ప్రతిష్టను పెంపొందించుకుంటారు. కొంత మంది మాత్రం పదవులు వస్తే...తమంత వీరుడు లేనట్లు ఏక వచనంలో సంభోదిస్తూ, ప్రతివారితో వివాదాలు పెట్టుకుంటూ...అప్పటి వరకు తెచ్చుకున్న పేరును చెడగొట్టుకుంటారు. ఈ రెండో కోవలోకే వస్తారు...ఆర్టీసీ ఛైర్మన్‌ వర్లరామయ్య.

    టిడిపిలో సీనియర్‌ దళిత నాయకునిగా పేరున్న 'వర్ల రామయ్య'కు నోటి దురుసు ఎక్కువే. ఎంతటి వారినైనా...ఏకవచనంలో సంభోదిస్తూ..పాత వాసనలు తనలో పోలేదని నిరూపించు కుంటున్నారు. తాజాగా..మచిలీపట్నంలో బస్సులో ప్రయాణిస్తున్న యువకుడిపై నోరు పారేసుకుని... తనకు ఎంత నోటి దురుసో కెమెరాల సాక్షిగా నిరూపించుకున్నారు. మచిలీపట్నం బస్‌స్టాండ్‌లో ఆకస్మిక తనిఖీలకు వెళ్లిన 'వర్ల'కు అక్కడ బస్సులో ఫోన్‌ చూస్తూ..తనను పట్టించుకోని యువకునిపై...పీకల వరకు కోపం వచ్చింది. ఆర్టీసీ ఛైర్మన్‌ వస్తే...కనీసం పట్టించుకోకపోవడమా..? అంటూ హుంకరించి...ఆ యువకుని...పిలిచి..అతని కులాన్ని అడిగి మరీ...నోరు పారేసుకున్నారు. ఫోన్‌ చూస్తూ పరిసరాలను మరిచిపోయారంటూ...ఆ యువకునిపై 'వర్ల' విరుచుకుపడ్డారు. అతను దేనికీ పనికిరాడంటూ..పోలీసు భాష అయిన 'లం....కొ...లను యధేచ్చగా ఉపయోగించారు. 'వర్ల' భాష విన్న టిడిపి నాయకులు, ప్రయాణీకులు అవాక్కైయ్యారు. ప్రజాప్రతినిధి అయి ఉండి...బాధ్యతా యువతమైన ఆర్టీసీ ఛైర్మన్‌ పదవిలో బహిరంగంగా...నోటికి పనిచెప్పడంపై పార్టీ నాయకులతోపాటు, ఇతరులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

   పోలీసు అధికారిగా పనిచేసిన 'వర్లరామయ్య' టిడిపిలో సీనియర్‌ దళిత నాయకునిగా పేరుంది. 2009 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరిన 'వర్ల రామయ్య' అనతి కాలంలోనే పార్టీలో ఎదిగారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన 'వర్ల'ను 2009 ఎన్నికల్లో అధిష్టానం 'తిరుపతి' నుంచి పోటీ చేయించింది. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన 'వరప్రసాద్‌' చేతిలో వర్ల 19276 ఓట్ల తేడాతో ఓడిపోయారు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు...'వర్ల' పార్టీలో కీలకంగా వ్యవహరించారు. దళిత నేతగా అధిష్టానం వద్ద గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు 2014 ఎన్నికల్లో కృష్ణా జిల్లా 'పామర్రు' నుంచి అసెంబ్లీకి పోటీచేయించారు 'చంద్రబాబు'. అయితే...ఈ ఎన్నికల్లోనూ...'వర్ల'కు ఓటమే ఎదురైంది. వైకాపా మహిళా నేత..ఉప్పులేటి కల్పన చేతిలో 1069 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే టిడిపి ఈ ఎన్నికల్లో గెలిచి...అధికారంలోకి రావడంతో...'వర్ల'కు కార్పొరేషన్‌ పదవి లభించింది. ఇటీవలే ఆ కార్పొరేషన్‌ పదవి ముగియడంతో...ఆయనను అధిష్టానం రాజ్యసభకు నామినేటెడ్‌ చేయాలని భావించింది. కానీ..ఆఖరి నిమిషంలో..ఆయనను తప్పించి..వేరే వారిని ఎంపిక చేసింది. రాజ్యసభ తప్పిపోయినా...ఆయనను ప్రతిష్టాత్మకమైన ఆర్టీసీ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా నియమించారు 'చంద్రబాబు'. ఆర్టీసీ ఛైర్మన్‌గా ఇప్పటికే పలు బస్‌స్టాండ్‌ల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తోన్న 'వర్ల రామయ్య' నోటికి పనిచెబుతూ..వ్యక్తిగతంగా పరువు పోగొట్టుకుంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తెస్తున్నారనే విమర్శ వస్తోంది. పార్టీలో పనిచేస్తోన్న ఇతర ఎస్సీ నేతలు...అందరితో అప్యాయంగా ఉంటూ..అందరి మన్నలను పొందుతుంటే...'వర్ల' మాత్రం వివాదాస్పదం అవుతున్నారు. సీనియర్‌ నేతగా గుర్తింపు పొందిన 'వర్ల' ఇప్పటికైనా..తన తప్పులను తెలుసుకుని..అందరితో సఖ్యతగా, గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి 'వర్ల' అంత ఈజీగా మారతారా..? ఏమో...చూడాలి..మరి.


(331)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ