WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆంధ్రజ్యోతి'పై సోషల్‌మీడియాలో విమర్శలు...!

కర్ణాటకలో బిజెపి గెలుస్తుందని...ఆంధ్రజ్యోతిలో నిన్న వచ్చిన వార్తాపై సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి దాకా...కాంగ్రెస్‌ గెలుస్తుందనే విధంగా వార్తలు ఇచ్చిన 'ఆంధ్రజ్యోతి' ఒక్కసారిగా...బిజెపికి ఎడ్జ్‌ ఉందని...ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని..దీనికి ఎన్నికల సర్వేలో పేరుగాంచిన 'లగడపాటి రాజగోపాల్‌' పేరు వాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండగా..కావాలనే 'ఆంధ్రజ్యోతి' ఈ విధంగా వ్యవహరించిందని..కొందరు అనుమానిస్తున్నారు. 'ఆంధ్రజ్యోతి' ఎందుకు ఒక్కసారిగా బిజెపి వైపు మళ్లిందనే దానిపై కూడా రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు బిజెపి అధినాయకత్వం అన్యాయం చేసిందని...ఆ పార్టీని తరిమికొట్టాలన్నట్లుగా వార్తలు ప్రచురించే...'ఆంధ్రజ్యోతి' ఒక్కసారిగా యూ టర్న్‌ తీసుకుని...కర్ణాటకలో బిజెపి గెలుస్తుందని ప్రచారం చేస్తుందని...ఇది తగదని..సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటే...టిడిపి కార్యకర్త ఒకరు అన్నారు. ఎందుకు ఆ పత్రిక ఆ విధమైన వైఖరి తీసుకుందో..తనకు తెలియదు కానీ...ఈ రకమైన పోకడలు సరికాదని...ఆయన వ్యాఖ్యానించారు. 

   ఇదే విధంగా మరి కొందరు కూడా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా...'ఆంధ్రజ్యోతి' పత్రికకు బిజెపి భారీగా ప్రకటనలు విడుదల చేసిందని...అందుకే ఆ విధంగా వ్యవహరిస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తుండగా...మరి కొందరు మాత్రం దీనిలో రాజకీయ ఉద్దేశ్యాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే...ఆ ప్రభావం 'తెలంగాణ'పై పడుతుందని...దాని వల్ల...ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ స్నేహితుడు అయిన కెసిఆర్‌కు ఇబ్బంది వస్తుందని...అందుకే కర్ణాటకలో బిజెపి గెలవాలని...ఆ పత్రిక కోరుకుంటుందని..అందుకే ఆ విధంగా వ్యవహరిస్తున్నారని మరి కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా...'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన వార్తపై ఆ సంస్థలో పనిచేస్తోన్న సిబ్బంది కూడా చర్చించుకుంటున్నారు. మొత్తం మీద...కర్ణాటక ఎన్నికల హీట్‌ ఇటు ఆంధ్రా,తెలంగాణతో పాటు..దక్షిణాది మొత్తానికి తాకుతున్నదనేది యధార్థం.  

(265)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ