WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఐ&పిఆర్‌కు మళ్లీ అరాచకశక్తి వస్తోందా...!?

ఆంధ్రప్రదేశ్‌ పౌరసంబంధాలశాఖలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ నెల31వ తేదీన...ఆశాఖలో పనిచేస్తోన్న ఆడిషనల్‌ డైరెక్టర్‌ పదవీ విరమణ చేయనుండడంతో...ఆ పదవిని ఎవరితో పూరిస్తారనే చర్చ ఉద్యోగుల్లో జోరుగా జరుగుతోంది. గతంలో ఈ పదవి నిర్వహించిన వ్యక్తిపై అవినీతి ఆరోపణలు రావడంతో...ఆయనను ఇక్కడ నుంచి తప్పించారు. తరువాత...ఆడిషనల్‌ డైరెక్టర్‌గా గవర్నర్‌ వద్ద పనిచేసిన 'కృష్ణానంద్‌'ను తీసుకువచ్చారు. అయితే...ఆయన ఈ నెలాఖరుకు రిటైర్‌ కానుండడంతో..ఈ పోస్టు కోసం గతంలో ఈ పోస్టులో పనిచేసిన వ్యక్తి మళ్లీ ఆ పోస్టు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే మాట ఉద్యోగుల నుండి వ్యక్తం అవుతోంది. గతంలో ఆయన ఆడిషనల్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, అరాచకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. పలు యాడ్‌ ఏజెన్సీలకు యాడ్స్‌ ఇచ్చి భారీగా కమీషన్లు తీసుకున్నారనే విమర్శ ఉంది. 

  గతంలో సమాచార కమీషనర్‌గా 'రమణారెడ్డి' ఉన్నప్పుడు...ఈ వ్యక్తి అడ్డగోలుగా వ్యవహరిం చారని...ఎవరైతే కమీషన్లు ఇస్తారో..వారికే...అవుట్‌డోర్‌ యాడ్స్‌ ఇచ్చారని...అప్పుడు 'రమణారెడ్డి'... సదరు అధికారి ఇద్దరూ కలసి కమీషన్లు పంచుకున్నారని...ఆరోపణలు వచ్చాయి. వారిపై వచ్చిన విమర్శలు, ఆరోపణలపై ప్రభుత్వం చాలా ఆలస్యంగా స్పందించింది. డిప్యూటేషన్‌పై వచ్చిన రమణారెడ్డి డిప్యూటేషన్‌ పొడిగించకుండా...ఆయనను వెల్లగొట్టింది. అదే సమయంలో ఆడిషనల్‌ డైరెక్టర్‌గా ఉన్న అరాచకశక్తిపై కూడా వేటు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి ఈ అరాచకశక్తి వ్యవహారం వెళ్లడంతో...ఆయనే స్వయంగా సదరు అధికారిని పిలిచి తిట్టారని...తనకు కనిపించవద్దని హెచ్చరించారని...అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో...వెంటనే ఆయనను సమాచారశాఖ కమీషనరేట్‌ నుంచి బదిలీ చేశారు.

  అయితే...తాజాగా...ఆడిషనల్‌ డైరెక్టర్‌ పదవీ విరమణ చేయనుండడంతో...మళ్లీ ఆ పదవిని పొందేందుకు..ఈ అరాచకశక్తి..మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టిందని...ఉద్యోగవర్గాలు చెప్పుకుం టున్నాయి. వందల కోట్ల ఆస్తి ఉన్న...ఈయన సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి వద్ద లాబీ మొదలు పెట్టారని...త్వరలో ఆ పోస్టులో తానే కూర్చుంటానని..తన సన్నిహిత వర్గాలతో చెబుతు న్నారట. 'ఏముంది...మంత్రికి సొమ్ములు వెదజల్లితే...నాకు ఆ పోస్టు రాదా..? అంటూ సన్నిహితులతో ప్రశ్నిస్తున్నారట....? సొమ్ములకు లొంగని వారు ఎవరు..బాస్‌...? అంటూ...రెచ్చిపోతున్నారట. కాగా ఇటువంటి అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి మళ్లీ ఈ పోస్టుకు వస్తే..తమకు తిప్పలు తప్పవని కొన్ని అవుట్‌డోర్‌ యాడ్‌ ఏజెన్సీలు...ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాము ఇచ్చింది..తీసుకుంటే...ఓకే...కానీ...ఆయనే టార్గెట్‌పెట్టి...ఇంత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే..ఎలా చచ్చేదని..పేరు చెప్పడానికి ఇష్టపడని యాడ్‌ ఏజెన్సీ ప్రతినిధి ఒకరు 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌'తో అన్నారు. ఆయన వస్తే..మళ్లీ తమకు తిప్పలు తప్పని...ఆయన సీట్లో..ఉంటారు...ఆయన ఎదురుగా...ఆయన ఏజెంట్‌ ఉంటారు...ఆయన చెప్పింది...ఈయనకు మేము చెల్లించాలి...? మళ్లీ పాతరోజులు వస్తున్నాయేమో...ఇటువంటి అరాచకశక్తిని ఎదుర్కొనే వారు ఎవరూ లేరా..? అని వారు ప్రశ్నిస్తున్నారు. మరి సమాచారశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులకు...ఈ సంగతి తెలుసో లేదో..మరి? సీనియర్‌ అధికారులకైనా...ఈయన సంగతి తెలుసో...లేదో...? మొత్తం మీద...ఇప్పుడు సమాచారశాఖలో ఈ వ్యవహారం జోరుగా చర్చ జరుగుతోంది.  

(554)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ