WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కర్ణాటక మళ్లీ కాంగ్రెస్‌దే...!

దేశ వ్యాప్తంగా ప్రజలు అత్యంత ఉత్కంఠతో చూస్తోన్న కర్ణాటక ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని...ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. మెజార్టీ మీడియా సంస్థలు కాంగ్రెస్‌నే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టంగా చెప్పాయి. కొన్ని మీడియా సంస్థలు బిజెపి అధికారంలోకి వస్తుందని చెబుతుండగా..మరి కొన్ని మాత్రం హంగ్‌ అసెంబ్లీ వస్తుందని జోస్యం చెప్పాయి. అయితే ఎగ్జిట్‌పోల్స్‌ నిర్వహించిన మీడియా సంస్థల్లో ఎక్కువ సంస్థలు...కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ ఉందని..పేర్కొనగా.. న్యూస్‌ఎక్స్‌, రిపబ్లిక్‌ టివి మాత్రం బిజెపి గెలుస్తుందని తెలిపాయి.

విఎంఆర్‌-టైమ్స్‌ నౌ: ఈ ఛానెల్స్‌ చేసిన సర్వే ప్రకారం కాంగ్రెస్‌ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. ఆ పార్టీకి 98 నుంచి 103 సీట్లు వస్తాయని పేర్కొంది. బిజెపికి 80నుంచి 93, జెడిఎస్‌ 31 నుంచి 39 వస్తాయని పేర్కొంది. ముంబాయి-కర్ణాటక మరియు పాత మైసూర్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఈ సంస్థ తెలిపింది. అదే విధంగా కోస్తల్‌ కర్ణాటకలో బిజెపి కన్నా కాంగ్రెస్‌కే ఎడ్జ్‌ ఉందని పేర్కొంది. ఇక్కడ కాంగ్రెస్‌ 13 సీట్లు , బిజెపి8సీట్లు సాధిస్తాయని పేర్కొంది. పాత మైసూర్‌ ప్రాంతంలో జెడిఎస్‌కు మరియు కాంగ్రెస్‌కు మధ్య నెక్‌ టు నెక్‌ ఫైట్‌ ఉందని స్పష్టం చేసింది. బెంగుళూరు పట్టణంలో మాత్రం కాంగ్రెస్‌,బిజెపి చెరో 14సీట్లను గెలుచుకుంటాయని తెలిపింది.

ఆజ్‌తక్‌: ఈ సంస్థ సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 106-118 సీట్లు వస్తాయని తెలిపింది. బిజెపికి 79-92 సీట్లు, జెడిఎస్‌కు 22-30 సీట్లు వస్తాయని తెలిపింది.

సిఎన్‌ఎన్‌-న్యూస్‌ ఎక్స్‌: ఈ సంస్థ చేసిన సర్వే ప్రకారం బిజెపికి 102-110 సీట్లు వస్తాయని పేర్కొంది. కాంగ్రెస్‌కు 72-78, జెడిఎస్‌కు 35-39 సీట్లు వస్తాయని తెలిపింది.

సువర్ణ టివి: ఈ సంస్థ సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 106-118 సీట్లు, బిజెపికి 79-92సీట్లు, జెడిఎస్‌కు 22-30సీట్లు వస్తాయని తెలిపింది.

ఇండియా టుడే: ఇండియా టుడే,యాక్సిస్‌ మై ఇండియా సంస్థలు కలసి నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్‌ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని చెప్పింది. ఈ సంస్థ 222 నియోజకవర్గాల్లో దాదాపు 70,574 మందిని కలసి వారి అభిప్రాయాన్ని సేకరించింది. దీని ప్రకారం కాంగ్రెస్‌ 106 నుంచి 118 సీట్లు సాధిస్తుందని తెలిపింది. బిజెపికి 79-92సీట్లు, జెడిఎస్‌ 22-32 సీట్లు సాధిస్తాయని పేర్కొంది. ఎగ్జిట్‌పోల్స్‌ సర్వే ప్రకారం కాంగ్రెస్‌ 39శాతం, బిజెపి35, జెడిఎస్‌ 17శాతం ఓట్లు సాధిస్తాయని తెలిపింది.

రిపబ్లిక్‌ టివి: బిజెపికి అనుకూలమైన ఛానెల్‌గా పేరొందిన రిపబ్లిక్‌ టివి కర్ణాటకలో బిజెపి గెలుస్తుందని స్పష్టం చేసింది. ఆ పార్టీ 95-114 సీట్లు సాధిస్తుందని తెలిపింది. కాంగ్రెస్‌కు 73-82, జెడిఎస్‌ 32-43 సీట్లు వస్తాయని పేర్కొంది.

సి-ఓటర్‌: ఈ సంస్థ కూడా బిజెపి గెలుస్తుందని ప్రకటించింది. బిజెపి 97-109 సీట్లు, కాంగ్రెస్‌కు 87-99 సీట్లు, జెడిఎస్‌కు 21-30 సీట్లు వస్తాయని పేర్కొంది.


(710)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ