WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అతిపెద్ద పార్టీగా 'బిజెపి'....!

కాంగ్రెస్‌కు 80,జెడిఎస్‌కు 41సీట్లలో ఆధిక్యం...!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఎగ్జిట్‌పోల్స్‌ను నిజం చేస్తూ...ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రావడం లేదు. తొలి ఫలితాల్లో అధికార కాంగ్రెస్‌ ముందంజలో ఉండగా...అన్ని చోట్ల ఫలితాలు వెలువడుతుండడంతో...కాంగ్రెస్‌ ఆధిక్యం మాయమైంది. పలుచోట్ల బిజెపి అభ్యర్థులు ముందంజలోకి వచ్చారు. అదే సమయంలో జెడిఎస్‌ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఆ పార్టీ దాదాపు 40సీట్లలో ఆధిక్యంలో ఉంది. బిజెపి 93స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా...కాంగ్రెస్‌ 80 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం మీద ముందే అంచనా వేసిన విధంగా...హంగ్‌ అసెంబ్లీ తప్పని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. బిజెపి వందస్థానాలు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉండగా...జెడిఎస్‌తో కలసి...ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అప్పుడే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా...తమకు మెజార్టీ రాకపోతే...జెడిఎస్‌కు మద్దతు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. మొత్తం మీద 41సీట్లు సాధించిన జెడిఎస్‌ కర్ణాటకను పాలించబోతోంది.


(228)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ