WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గెలిచిన ఓడిన 'చంద్రబాబు'...ఓడి గెలిచిన 'జగన్‌'...!

రాజకీయాల్లో ఎవరూ ఊహించని సంఘటనలు జరుగుతాయని నాయకులకు తెలిసినప్పటికీ, తప్పుడు సలహాలతో, మంది మాగాధుల తో తెరపైకి వచ్చిన వారెందరో ఉన్నారు. ఆ కోవలోకే వస్తారు...ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్‌డిఎతో తెగతెంపులు చేసుకున్నా...తన పార్టీనీ బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేసుకోకుండా...అధికార, సమీక్షా సమావేశాలతో కాలాన్ని వృధా చేసుకుని పార్టీపై దృష్టిసారించలేదు. కర్ణాటక ఎన్నికల్లో మౌనం దాల్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు...అక్కడ ఎపికి ద్రోహం చేసిన మోసం చేసిన బిజెపికి ఓటు వేయవద్దు..అని పిలుపు ఇచ్చి..రాజకీయంగా దెబ్బతిన్నారు. తెరవెనుక ఉండి..తన మనషులందరినీ కర్ణాటక పంపించి...ప్రచారంలో తోడ్పడిన...జగన్‌...అక్కడ బిజెపి అధికారంలోకి రావడంతో...రాజకీయంగా కొంత బలపడినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు...'చంద్రబాబు', 'జగన్‌'లు ఊహించినట్లుగా రాలేదు. కానీ...తెలివిగా 'జగన్‌' రాజకీయంగా వ్యూహంగా వ్యవహరించి..తనకు అత్యంత సన్నిహితుడైన 'విజయసాయిరెడ్డి'తో ప్రచారం చేయించారు. గాలి జనార్థన్‌రెడ్డికి ప్రాధాన్యత ఇప్పించి...మళ్లీ ఆయనను తెరపైకి తీసుకువచ్చారు. అవినీతి పరులను ఓడించాలని కాంగ్రెస్‌ ప్రచారం చేసినా ఓటర్లు పట్టించుకోలేదు. ఎప్పుడూ ఆలోచించి...నిర్ణయాలు తీసుకునే 'చంద్రబాబు'...కర్ణాటక విషయంలో తొందరపడ్డారని...రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎప్పుడో కర్ణాటకకు వలస వచ్చాం..ఆ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మనకేమిటి..? అని తెలుగు ఓటర్లు భావించి...బిజెపికి ఓటు వేసి ఉంటారని..విశ్లేషకులు చెబుతున్నారు. 

 బిజెపి అధికారంలోకి వచ్చినా..రాకపోయినా...తాను పరోక్షంగా ఎటువంటి వేధింపులు ఉండవని... 'జగన్‌'కు తెలుసు. అందుకే తెరవెనుక ఉండి..తన మనుషుల ద్వారా బిజెపికి అనుకూలంగా ప్రచారం చేయించారు. ఎన్నికల ఫలితాలు...బిజెపికి అనుకూలంగా వెలువడడంతో..'జగన్‌'ను 'మోడీ' ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. మరో సంవత్సరం లోపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 'చంద్రబాబు'ను ఎలా దెబ్బకొట్టాలని ఆలోచించిన 'జగన్‌'కు కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని పెంచాయి. ఇక నుండి 'చంద్రబాబు'పై 'జగన్‌' ఒంటికాలితో దాడి చేయవచ్చు. ఇంటి పక్కవారికి అన్యాయం జరిగితేనే..స్వార్థంతో పట్టించుకోని తెలుగువారు...ఆలోచిస్తారనే విమర్శ ఉంది...రెండు వేల ఓటుకు ఆశపడ్డారే తప్ప...తమ సోదరులకు అన్యాయం జరిగిందనే విషయాన్ని వారు పట్టించుకోలేదన్నది స్పష్టమైంది. ఇది 'చంద్రబాబు'కు ఒక రకమైన అనుభమే తప్ప...కర్ణాటక ఫలితాలతో తాను అధికారంలోకి వస్తానని 'జగన్‌' కలలు కన్నా...అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో...'పవన్‌'తో బిజెపితో తెగతెంపులు చేసుకున్న 'చంద్రబాబు' కర్ణాటక ఫలితాలు తరువాత మరింత జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు వారం రోజుల పాటు 'జగన్‌'లో ఉత్సాహం నింపవచ్చునేమో కానీ..తరువాత..ఇదే పరిస్థితి ఉంటుదేమోనన్నది 'జగన్‌' తెలుసుకోలేకపోతున్నారు.

(బి.ఆర్‌.కె.మూర్తి)


(250)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ