'అనకాపల్లి'లో మూడుముక్కలాట...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అనకాపల్లి'లో మూడుముక్కలాట...!

విశాఖపట్నం జిల్లా 'అనకాపల్లి' నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానంటే..తాను పోటీ చేస్తానని..ముగ్గురు నాయకులు పరస్పరం పోటీ పడుతున్నారు. అందులో ఒకరు..విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మరొకరు..అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌, మూడవ వారు ప్రస్తుత ఎమ్మెల్యే...ఉన్నారు. 2009లో అనకాపల్లి నుంచి తాను విజయం సాధించాను..అనుకోని పరిస్థితుల్లో 2014లో భీమునిపట్నంలో పోటీ చేయాల్సి వచ్చింది..ఈసారి అనకాపల్లి నుంచే..పోటీ చేయాలనుకుంటున్నానని మంత్రి గంటా చెబుతున్నారు. అప్పట్లో 'చంద్రబాబు' కోరికపై అనకాపల్లి ఎంపీగా పోటీ చేశాను..ఇప్పుడు తనకా సీటు కావాలని కోరుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే పీలా గోవింద్‌ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని..మళ్లీ తానే ఇక్కడ నుంచిపోటీ చేస్తానని..చెబుతున్నారట. ఈ మూడు ముక్కల్లో ఏ ముక్కకుపోటీ చేసే అవకాశం వస్తుందో కానీ..వారు పరస్పరం పోటీపడి..ఆరోపణలు చేసుకుంటున్నారు. మాజీమంత్రి దాడి వీరభద్రరావు తనకు అనకాపల్లి నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తే..తాను టిడిపిలో చేరతానని మధ్యవర్తుల ద్వారా చంద్రబాబుకు తెలియజేశారు. ఇప్పటికే..ముగ్గురు కృష్ణులు అనకాపల్లిలో కొట్టుకుంటున్నారు...ఇప్పుడు మరో కృష్ణుడు వస్తే..మరో ముక్క అవుతుందని..దీనిపై చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 1985,89,99లో విజయం సాధించి తరువాత ఎమ్మెల్సీగా ఎన్నికై..తిరిగి మళ్లీ ఎమ్మెల్సీ ఇవ్వలేదనే సాకుతో వైకాపాలోకి చేరి రాజకీయంగా తెరమరుగైపోయారు దాడి. 2014 ఎన్నికల్లో ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడంజరిగింది. దాడి వీరభద్రరావును పార్టీలో చేర్చుకుని...ఆయనకు కానీ..ఆయన కుమారుడికానీ పోటీ చేయించే ఆలోచన 'చంద్రబాబు'కు ఉందని..కానీ..దీన్ని ఎప్పుడు ఆయన కార్యరూపంలోకి తెస్తారో చెప్పలేమని..చెబుతున్నారు. నియోజకవర్గం టిడిపికి కంచుకోట అని...అందుకే...నలుగురు పోటీ పడుతున్నారని..దీనిని చంద్రబాబు ఎలా సరిదిద్దుతారో..మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం.

(148)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ