'అద్దంకి'లో 'కరణం' ముసలం...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అద్దంకి'లో 'కరణం' ముసలం...!

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారని...ఈ విషయంతో తండ్రీ కొడుకులు కలుగచేసుకోవద్దని ఇదే ఆఖరి హెచ్చరిక అని...ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్‌ను హెచ్చరించినప్పటికీ...తెరచాటున ఎమ్మెల్సీ 'కరణం' విమర్శలు చేస్తున్నారు. ఆయనతో పాటు కుమారుడు వెంకటేశ్‌ కూడా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారనే తెలుస్తోంది. 2019లో తానే ఎన్నికల్లో 'అద్దంకి' నుంచి పోటీ చేస్తానని 'వెంకటేష్‌' బహిరంగంగా చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. చంద్రబాబు హెచ్చరించినా...'కరణం, వెంకటేష్‌'లు ప్రవర్తన మార్చుకోవడం లేదని, వారిద్దరిపై..చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే 'బుజ్జి' అనుచరులు డిమాండ్‌ చేస్తున్నారు. తండ్రీ,కొడుకులను ఓడించిన చరిత్ర మా ఎమ్మెల్యే రవిది...ఓడిపోయినా..కరణంకు ఎమ్మెల్సీ ఇచ్చి చంద్రబాబు ఆదుకున్నా..అయినా..వారు 'అద్దంకి'లో పర్యటించడంలో ఆంతర్యం ఏమిటని 'రవి' అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఎంత మౌనంగా ఉంటున్నా...తండ్రీ,కొడుకులు ఏదో వివాదం సృష్టించడం పనిగా పెట్టుకున్నారని..మంత్రి లోకేష్‌ దృష్టికి ఈ విషయాన్ని కొందరు పార్టీ నాయకులు తీసుకెళ్లారు. సమన్వయ కమిటీలో ఈ వ్యవహారాన్ని లేపే అవకాశాలున్నాయని, అధినేత చంద్రబాబు దీనిపై ఏ విధంగా స్పందిస్తారో..ఏరకమైన చర్యలు తీసుకుంటారో..చూస్తామని చెబుతున్నారు..'రవి' అనుచరులు.

(365)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ