WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కొమ్మాలపాటి' కులపంచాయితీ...!

ఆయన సీనియర్‌ టిడిపి నేత. ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోట అయిన పెదకూరపాడులో రెండుసార్లు విజయం సాధించి అధినేత చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేశారు. మరోసారి...ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి...రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన మరోసారి నిలబడితే...ఓడించడం కష్టమనే అభిప్రాయం..ప్రతిపక్ష వైకాపాలోనూ ఉంది. ఆయనకు ధీటైన అభ్యర్థిని రంగంలోకి దించాలని..ఆపార్టీ వ్యూహాలను సిద్దం చేసుకుంటోంది. వైకాపా బలమైన అభ్యర్థిని దించడం సంగతి ఏమో కానీ...ఈలోపే ఆ బలమైన ఎమ్మెల్యే...రోజుకో వివాదంతో...బలహీనపడుతున్నారు. ప్రస్తుతం..ఆయన పరిస్థితి చూసిన..టిడిపి నేతలు..ఇదెక్కడ గొడవరా..బాబూ..అంటూ నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు అక్రమ ఇసుక రవాణాతోనే...తలనొప్పులు తెచ్చుకున్న మా నేత...ఇప్పుడు కుల పంచాయితీలో ఇరుక్కోవడమేమిటని...బాధపడుతున్నారు. ఇంతకీ ఈ ఎమ్మెల్యే ఎవరును కుంటున్నారా..? ఆయన ఎవరో కాదు..గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే 'కొమ్మాలపాటి శ్రీధర్‌.

   ఒకప్పుడు ప్రస్తుత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు 'కన్నా లక్ష్మీనారాయణ' స్వంత నియోజకవర్గమైన 'పెదకూరపాడు'లో ప్రతిసారీ టిడిపి ఓటమినే చవిచూసింది. అయితే 2009 ఎన్నికల్లో...పారిశ్రామికవేత్త అయిన 'కొమ్మాలపాటి శ్రీధర్‌'ను ఆ పార్టీ రంగంలోకి దించి..విజయం సాధించింది. తరువాత 2014లో కూడా ఆయన వైకాపా అభ్యర్థిపై విజయం సాధించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉండే నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో అక్రమ ఇసుక రవాణాలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అక్రమ ఇసుక రవాణా ద్వారా వందలకోట్లు సంపాదించారని, వాటిని రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారని పార్టీలో నాయకులు, కార్యకర్తలతో పాటు, ప్రత్యర్థులు కూడా ఆరోపిస్తారు. ఇసుక రవాణాలో ఆయన కూరుకుపోయారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఇంటిలిజెన్స్‌ కూడా సిఎం చంద్రబాబును కోరిందనే ప్రచారం ఉంది. అయితే...పార్టీకి విధేయుడు..జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుకు బంధువైన 'కొమ్మాలపాటి'పై చర్యలు తీసుకునే ధైర్యం అధ్యక్షుడు చేయలేడని పార్టీ వర్గాలే చెవులు కొరుకుంటున్నాయి.

    ఇది ఇలా ఉంటే...ప్రస్తుతం..ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. టిడిపికి అనాదిగా అండగా ఉంటూ..ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా, సొంత సొమ్ములు ఖర్చు పెట్టుకుని...గెలిపించే సామాజికవర్గంలో 'చిన్నా, పెద్దా' అంటూ ఎమ్మెల్యే వివాదాలు సృష్టించారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. గత నాలుగేళ్ల నుంచి ఎమ్మెల్యే ప్రవర్తనలో మార్పు వచ్చిందని..ఆయన సొంత కులానికి చెందిన వారిలోనే గొడవలు పెడుతున్నారని పార్టీ కార్యకర్తలు కొందరు ఆరోపిస్తున్నారు. 'కమ్మ' సామాజికవర్గంలోని 'పెదకమ్మ, చినకమ్మ'లంటూ విడదీసి ఆయన రాజకీయాలు చేస్తున్నారని వారు అంటున్నారు. 'పెదకమ్మ'లకు ప్రాధాన్యత ఇస్తూ..చిన్నకమ్మలను చిన్నచూపు చూస్తున్నారని...వారు విమర్శిస్తున్నారు. దీనిపై నియోజ కవర్గంలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే 'అక్రమ ఇసుక రవాణాలో' విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న... 'కొమ్మాలపాటి'కి తాజా కులపంచాయితీ గట్టిదెబ్బేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీలో వచ్చిన ఈ గొడవలను ప్రత్యర్థి పార్టీ వైకాపా అనుకూలంగా మలచుకుని 'కమ్మ' సామాజికవర్గానికి చెందిన వారిని తమవైపు ఆకర్షిస్తున్నారట.

(815)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ