WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వివాదాస్పద ఎమ్మెల్యేలే విజేతలట..!?

రెండు రోజుల క్రితం 'లగడపాటి రాజగోపాల్‌, ఆంధ్రజ్యోతి' సంస్థలు కలిపి నిర్వహించిన ప్లాష్‌ సర్వే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. పార్టీలకు అతీతంగా ఈ సర్వే గురించి రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార టిడిపి మళ్లీ గెలుస్తుందన్న సర్వేపై ఎక్కువ మంది అంగీకరిస్తున్నా...కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందన్న సర్వే ఫలితాలపై పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా గత నాలుగేళ్ల నుంచి వివాదాస్పదమైన పలువురు ఎమ్మెల్యేలు ప్రజలకు దగ్గరగా ఉంటున్నారని, వారినే మళ్లీ ప్రజలు గెలిపిస్తారని...సర్వే ప్రకటించడంపై సర్వే విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రసార సాధనాల్లో..పలువురు ఎమ్మెల్యేలు చేస్తోన్న అక్రమాలు, అరాచకాలు, అవినీతిపై పుంఖాను పుంఖానుగా వార్తలు వచ్చినా...మళ్లీ ప్రజలు వారికి ఓటు వేస్తారని ప్రకటించడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా 'నగరి' ఎమ్మెల్యే రోజా, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే 'బోండా ఉమామహేశ్వరరావు, కొండపి ఎమ్మెల్యే స్వామి, రేపల్లె ఎమ్మెల్యే 'అనగాని సత్యప్రసాద్‌'లు మళ్లీ గెలుస్తారని ప్రజలు వారి వైపే ఉన్నారని సర్వే టీమ్‌ ప్రకటించడంపై ఆయా నియోజకవర్గాల ప్రజలు, పార్టీ నాయకులు సర్వే విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

'రోజా': ఎమ్మెల్యేగా కంటే...'జబర్ధస్త్‌' జడ్జిగానే ఆమె రాష్ట్ర ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన, మారు మూల ప్రాంతమైన 'నగరి' నుంచి ఆమె గత ఎన్నికల్లో..కష్టపడి..అప్పటి మాజీమంత్రి..కీ.శే.ముద్దుకృష్ణమనాయుడుపై స్వల్ప తేడాతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఆమె ప్రతి విషయంలో వివాదాస్పదమయ్యారు. నోరు తెరిస్తే...బూతులు తిట్టే ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న ఆమె..ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే బాగా పనిచేస్తున్నారని సర్వే చెప్పడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తోటి మహిళా ఎమ్మెల్యేను అసెంబ్లీలో అనరాని మాటలు..అని సస్పెండ్‌ అయిన 'రోజా'...నగరి ప్రజలకు ఏమి చేసిందని..మళ్లీ ఆమెను ఎన్నుకుంటారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఆమెకు తమ షోలపైనే ధ్యాస ఎక్కువని, వాటితోనే కాలం గడుపుతారని...ప్రజలును పెద్దగా పట్టించుకోరనే మాట స్వంత పార్టీ నుంచే వ్యక్తం అవుతుంది. ఈసారి ఆమెకు టిక్కెట్‌ రాదని..ఆ పార్టీ సీనియర్‌ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తుంటారు. మరి..సర్వే ఈరకంగా చెప్పిందంటే...దీనిలో ఏదో ఉందని వారు అనుమానిస్తున్నారు.

'బోండా': విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన ఈయన కూడా వివాదాస్పదుడే. తోటి ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అనరాని మాటలు అని..వివాదాలకు తెరతీసిన ఆయనపై నియోజకవర్గ ఓట్లు పలు అభియోగాలు మోపారు. విజయవాడ చుట్టుపక్కల ఉన్న భూముల ఆక్రమణల్లోనూ, ఇతర భూ పంచాయితీల్లోనూ ఈయన పేరు మారు మ్రోగిపోయింది. అదే సమయంలో ఈయన గారి సుపుత్రుడు చేసే అరాచకాలు కూడా చర్చనీయాంశమే. మరి అటువంటి...బోండా ఉమామహేశ్వరరావు మళ్లీ గెలుస్తారని సర్వే ప్రకటించింది.

'స్వామి': ప్రకాశం జిల్లా కొండిపి ఎమ్మెల్యే 'స్వామి' మళ్లీ గెలుస్తారని ఆయన పాలన బాగుందని..నియోజకవర్గ ఓటర్లు చెప్పారని..సర్వే ప్రకటించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. నియోజకవర్గంలో మెజార్టీ ఓట్లు కలిగిన 'కమ్మ' సామాజికవర్గ నాయకులను ఆయన వేధించారనే మాట...అక్కడి టిడిపి నాయకులే చెబుతున్నారు. వారిపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తుంటే..వాళ్లంతా...'స్వామి'కి మద్దతు ఇస్తారా..? అదే విధంగా..జిల్లా అధ్యక్షుడి కుటుంబంలో చిచ్చుపెట్టి..వారి నమ్మకాన్ని వమ్ముచేసిన..ఎమ్మెల్యేకు వారు సహకరిస్తారా..? పార్టీ నాయకులను నాలుగు గ్రూపులుగా చీల్చి..గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే మళ్లీ గెలుస్తారని సర్వే ప్రకటించడంపై ఇక్కడ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

'అనగాని': గుంటూరు జిల్లాకు 'రేపల్లె' నియోజకవర్గ ఎమ్మెల్యే 'అనగాని సత్యప్రకాశ్‌' పనితీరుపై 70శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సర్వే ప్రకటించడంపై నియోజకవర్గంలో విస్మయం వ్యక్తం అవుతోంది. అనేక వివాదాస్పద నిర్ణయాలు, అవినీతి, అక్రమాలకు ఎమ్మెల్యే తావిస్తున్నారని ఆరోపణలు వస్తుంటే...ఆయన సత్యహరిచంద్రుడని...ఆయనే మళ్లీ గెలుస్తారని ప్రకటించడం వెనుక ఏదో జరిగిందనే అనుమానం ఓటర్లలో ఉంది. బీసీ వర్గానికి చెందిన 'అనగాని' ప్రస్తుతం ఆ వర్గానికి చెందిన వారినే దూరం చేసుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో...బీసీల్లో 90శాతం మంది ఓటర్లు ఆయనకు మద్దతు ఇవ్వగా..ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. బీసీ వర్గానికి చెందిన నాయకులపై ఎమ్మెల్యే సోదరుడు చేయిసుకోవడంతో..వారంతా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 'అనగాని'ని ఓడిస్తామని బహిరంగా చెబుతున్నారు. బినామీ పేర్లతో ఐదు వందల ఎకరాల భూమిని కాజేశారనే ఆరోపణలు ఆయనపై మొదటి నుంచి వస్తున్నాయి. అదే సమయంలో వివిధ పనులకు పర్సెంటేజీలు తీసుకుంటారనే మాట కూడా ఉంది. 2009 ఎన్నికల సమయంలో 'అనగాని'కి టిక్కెట్‌ ఇస్తే ఓడిపోతారని..' చంద్రబాబు' సర్వేలో తేలగా..ప్రస్తుతం సర్వే చేసిన మీడియా..అప్పట్లో ఆయన గెలుస్తారని మరో సర్వే చేసి ప్రకటించి ఆయనకు సీటు వచ్చే విధంగా వ్యవహరించింది. సీటు తెచ్చుకున్నా...'అనగాని' అప్పట్లో గెలవలేకపోయారు. మరి..ఈసారి కూడా అదే ఉద్దేశ్యంతో.. సర్వే సంస్థ ఈ రకమైన ఫలితాలను ప్రకటించిందా..అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. మొత్తం మీద..సర్వే ఫలితాలు...కొన్ని చోట్ల తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా వివాదాస్పద ఎమ్మెల్యేలు..ఆరోపణలు ఉన్నవారు.. ప్రజామద్దతు కోల్పోయిన వారు...మళ్లీ గెలుస్తారని ప్రకటించడం సర్వే సంస్థ విశ్వసనీయతపై సందేహాలను రేకెత్తిస్తోంది.

(767)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ