WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సోమిరెడ్డి' ముందు 'కాకాని' కుప్పిగంతులా..?

నెల్లూరు జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి వ్యవహారశైలితో చివరకు ఆ జిల్లా కలెక్టర్‌పై వైకాపా ఎమ్మెల్యేలు విమర్శలు, ఆరోపణలు చేసే పరిస్థితిని కల్పిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు సమర్థుడు, నిజాయితీపరుడు అనే పేరుంది. ఆయన మంత్రి సోమిరెడ్డి చెప్పిన పనులన్నీ చేస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే గోవర్థన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఆయన వ్యవసాయశాఖకు మంత్రి కాదు..అవినీతిశాఖకు మంత్రి అని..ఈ విషయంలో కలెక్టర్‌ ముత్యాలరాజు కూడా మంత్రి చెప్పిన పనులే చేస్తున్నారని 'కాకాని' బాహాటంగా విమర్శించారు. నెల్లూరు జిల్లాలో మంత్రి సోమిరెడ్డి 'కాకాని' మధ్య గత మూడేళ్ల నుంచి పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. మంత్రి అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని..అందుకు సబంధించిన రుజువులు తన దగ్గర ఉన్నాయని, ముఖ్యమంత్రి విచారణ జరిపించగలరా.. ? అని 'కాకాని' సవాల్‌ విసిరారు. జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుతో పాటు వివిధశాఖల అధికారులతో పాటు..ఎమ్మెల్యే కాకాని ఆరోపణలకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

  రాజకీయం పరంగా విభేదాలు ఉంటే మీరు..మీరు చూసుకోండి..మధ్యలో తమను బలిచేయవద్దని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా..ఆపార్టీ విధానాలకు లోబడి పనిచేశామని, పదేళ్ల కాంగ్రెస్‌ హయాంలో అదే చేశామని, ఇప్పుడూ అదే చేస్తున్నామని, తమ జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు నిజాయితీపరుడైన అధికారి. ఆయనపై కూడా ఆరోపణలు,విమర్శలు చేయడం సరి కాదని ఆయనపై కిందిస్థాయి అధికారులు గోవర్థన్‌రెడ్డిని కలసి వివరించినట్లు తెలిసింది. సోమిరెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో ఎక్కువగా చెప్పి..'కాకాని' అవస్థలు పడుతున్నారని, పరువు నష్టం కేసును కూడా ఎదుర్కొంటున్నారని, తొందరపడి నోరు జారితే..పరిస్థితి ఇలా ఉంటుందని 'కాకాని'కి ఆఖరు నిమిషంలో కానీ అర్థం కాలేదు. బాధ్యత గల మంత్రిపై విమర్శలు, ఆరోపణలు చేసే ముందు ఎంత పకడ్బందీగా సాక్ష్యాలు ఉన్నాయో...చూసుకోకుండా..నోరుంది కదా..అని విమర్శలు చేస్తే..పరిస్థితి ఇలానే ఉంటుందని..పలువురు రాజకీయనాయకులు చెబుతున్నారు. నిరాధరమైన ఆరోపణలు చేసి...అసలైన వాస్తవాలు బయటకు రాకుండా అడ్డుకున్న ఘనత 'కాకాని'కే దక్కిందని టిడిపి నేతలు అంటున్నారు. మంత్రి సోమిరెడ్డి నిజాయితీపరుడా..? కాదా..? అనే విషయం టిడిపి నాయకులు, వైకాపా నాయకులకు తెలుసు. 

  మంత్రి అక్రమాలపై ఆధారాలతో బయటకు తేవాల్సిన వైకాపా ఎమ్మెల్యేలు..ఆ విషయం చూడకుండా..తమలో తాము కలహించుకుంటూ...మంత్రిసోమిరెడ్డికి సహాయం చేస్తున్నారు. విషయంతెలియని ఎమ్మెల్యే కాకాని..రెచ్చిపోయి మాట్లాడి పరువు పోగొట్టుకుని..అప్రదిష్టపాలయి..కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. కలెక్టర్‌పై విమర్శలు, ఆరోపణలు చేయమే 'కాకాని' చేసిన తప్పుగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఏపార్టీ అధికారంలో ఉంటే..అందుకు అనుగుణంగా అధికారులు పనులు చేస్తుంటారు. నిబంధనలకు విరుద్దంగా మంత్రిసోమిరెడ్డి..ఎవరికి పనులు చేశారనే విషయాన్ని తెలుసుకోవాల్సిన 'కాకాని'..పవరో చెప్పిన మాటలు విని దానిపై విమర్శలు, ఆరోపణలు చేసి ఆయన చేతులు కాల్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో అధికారులు, ఉద్యోగులు, కలెక్టర్‌పై 'కాకాని' ఆరోపణలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ..ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. మంత్రి సోమిరెడ్డి తనకు ఉన్న అధికార, రాజకీయ అనుభవంతో...అధికారులను అనుకూలంగా మలచుకుని..వారిపై విమర్శలు, ఆరోపణలు చేసే విధంగా చేస్తున్నారని నెల్లూరులో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఒక మాజీమంత్రిని మీడియా వర్గాలు అడగగా...పొట్టి మంత్రి తెలివి తేటలు ముందు 'కాకాని' నెగ్గలేకపోతున్నారని, జిల్లా కలెక్టర్‌ సమర్థుడైన అధికారి అని అందరికీ తెలుసునని..ఆయనపై విమర్శలు చేసి..అసలైన వాస్తవాలు బయటపడకుండా 'కాకాని' తొందరపడి రాజకీయంగా అప్రదిష్టపాలైయ్యారని చెప్పారు. ఏది ఏమైనా హనుమంతుని ముందు కుప్పిగంతులా..? అన్నట్లు 'సోమిరెడ్డి' ముందు..'కాకాని' కుప్పిగంతులు వేస్తే..ఇలానే ఉంటుందని ఆయన అన్నారు.

(202)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ