లేటెస్ట్

వచ్చే ఏడాదిలో రిటైర్డ్‌ అయ్యే ఐఎఎస్‌ అధికారులు వీరే...!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సర్వీసుల్లో ఉండి...వచ్చే ఏడాదికి రిటైర్‌ అయ్యే అధికారుల పేర్లను ప్రభుత్వం ప్రకటించింది. 2020లో మొత్తం 8 మంది ఐఎఎస్‌ అధికారులు రిటైర్‌ కాబోతున్నారు. వీరిలో మొదటగా 1986వ బ్యాచ్‌కు చెందిన డి.సాంబశివరావు మార్చిలో రిటైర్‌ కానుండగా, ఇటీవల వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, అవమానకరంగా తొలగింపబడిన ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం ఏప్రిల్‌ మాసాంతానికి రిటైర్‌ అవుతారు. ఆయనతో పాటు శ్రీమతి ప్రీతీ సూడాన్‌, శ్రీమతి ఎం.పద్మలు కూడా ఇదే మాసంలో రిటైర్‌కానున్నారు. తరువాత ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'నీలమ్‌సహానీ' జూన్‌ మాసాంతానికి రిటైర్‌ అవుతారు. 1993 బ్యాచ్‌కు చెందిన కె.దమయంతి కూడా ఇదే మాసంలో రిటైర్‌ కానున్నారు. 2005వ బ్యాచ్‌కు చెందిన ఎం.రామారావు, టి.బాబురావు నాయుడుల్లో 'ఎం.రామారావు' జూన్‌లో రిటైర్‌ కానుండగా, టి.బాబరావునాయుడు డిసెంబర్‌లో సర్వీసు నుంచి రిటైర్‌ కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'నీలమ్‌ సహానీ' జూన్‌లో రిటైర్‌ అయితే ఆమె స్థానంలో నూతన సిఎస్‌ను ప్రభుత్వం నియమించుకోనుంది. 

(606)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ