WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'విశ్వవిజేత 'ఫ్రాన్స్‌'...!

ఫిపా వరల్డ్‌కప్‌ను గెల్చుకున్న ఫ్రాన్స్‌...!

ఫాన్స్‌ మరోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఆదివారం నాడు జరిగిన పుట్‌బాల్‌ ప్రపంచ్‌కప్‌ ఫైన్‌లో ఆ జట్టు క్రొయేషియాను 4ా2 తేడాతో ఓడించి..విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆద్యంతం ఫ్రాన్స్‌ సత్తా చాటింది. ఆట మొదలైన ఎనిమిది నిమిషాల్లో  క్రొషియా ఆటగాడు 'మారియో' సెల్ఫ్‌గోల్‌ చేయడంతో...ఫ్రాన్స్‌ ఆధిక్యం సాధించింది. అయితే  28వ నిమిషం వద్ద ఇవాక్‌ పెరిసిస్‌ ఫ్రీకిక్‌ ద్వారా గోల్‌ చేసి..స్కోరును సమం చేసి క్రొషియాను..పోటీలోకి తెచ్చారు. కానీ ఆ తరువాత క్రొయేషియా ఆటతీరు దిగజారడంతో...ఫ్రాన్స్‌ వరుసగా గోల్స్‌ మోత మోగించింది. 38వ నిమిషంలో గ్రీజ్‌మెన్‌ గోల్‌ చేసి ఫ్రాన్స్‌ ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు....ఆ వెంటనే...59వ నిమిషంలో 'పోగువా' 65వ నిమిషంలో 'ఎంబె' గోల్స్‌ చేసి..ఫ్రాన్స్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని అందించారు. ఇక 'క్రొయేషియా' అంతా మూటా ముల్లె సర్దుకోవాల్సిన సమయంలో ఫ్రాన్స్‌ గోల్‌ కీపర్‌ చేసిన తప్పు వల్ల క్రొయేషియా రెండో గోల్‌ చేయగలిగింది. తొలిసారి ఫైనల్‌ చేరిన క్రొయేషియా..ఫ్రాన్స్‌ దూకుడు ముందు నిలవలేకపోయింది. నిర్ణీత సమయం ముగిసే సమయానికి కూడా ఫ్రాన్స్‌ తన ఆధిక్యం నిలుపుకోవడం..అదనపు సమయంలో క్రొయేషియా సంచలనాలు సృష్టించకపోవడంతో..ఫ్రాన్స్‌ సునాయాసంగా...విశ్వవిజేతగా నిలిచింది.

(177)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ