లేటెస్ట్

'పవార్‌'కు షాకిచ్చిన 'బిజెపి'...!

ఎన్సీపీ అధినేత 'శరద్‌పవార్‌'కు బిజెపి షాక్‌ ఇచ్చింది. ఎవరూ ఊహించని రీతిలో రాత్రికి రాత్రి ఆ పార్టీని చీల్చి...రాష్ట్రంలో మళ్లీ బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సత్తాను మరోసారి చాటింది. ఉదయం వరకు మరో రెండు, మూడు రోజుల్లో శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ పార్టీల కలయికతో 'ఉద్దవ్‌థాక్రే' ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని భావించారు. అయితే బిజెపి పెద్దలు రాత్రికి రాత్రి పావులు కదిపి శనివారం ఉదయానికి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ  దేవేంద్ర ఫడ్నవిస్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది సేపటల్లోనే ప్రధాని నరేంద్రమోడీ 'ఫడ్నవిస్‌,పవార్‌'లకు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. నిన్నటి వరకు సాగిన రాజకీయ హైడ్రామాకు బిజెపి పెద్దలు తెరదించారు. కాగా..'శరద్‌పవార్‌' మేనల్లుడు 'అజిత్‌పవార్‌' ఎన్సీపీని చీల్చారని ప్రచారం జరుగుతోంది. ఆయన వెంట భారీగా ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని, వారంతా ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిజెపి, శివసేన కలిసిపోటీ చేశాయి.వాటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యా బలం ఉన్నా..తమకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని 'శివసేన' డిమాండ్‌ చేయడంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. తమకు ముఖ్యమంత్రి పదవి అప్పగించకపోతే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించమని 'శివసేన' మొరాయించింది. అంతే కాకుండా తమకు మొదటి నుంచి వ్యతిరేకులైన కాంగ్రెస్‌, ఎన్సీపీలతో చేతులుక లిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేసింది. అయితే 'మోడీ,అమిత్‌షా'ల వ్యూహం ముందు వారి ఎత్తులు చిత్తులైపోయాయి. ప్రస్తుత శాసనసభలో బిజెపికి 105,శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఎన్సీపీ నుంచి ఎంత మంది 'అజిత్‌పవార్‌' వెంట వస్తారో చూడాల్సి ఉంది. 

(434)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ