WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కాపు'లపై ఎదురుదాడే...!

కాపుల రిజర్వేషన్‌ అంశం రాష్ట్రపరిధిలో లేదని, వారికి రిజర్వేషన్లు ఇవ్వడం తన వల్ల కాదని...చేతులు ఎత్తేసిన వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తనపై వస్తోన్న వత్తిడిని తట్టుకోవడానికి ఎదురు దాడిని ప్రారంభించారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేనని చెప్పడంపై స్వంత పార్టీలోనే నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా..ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు కిందా మీదా..అవుతున్నారు. అటు వై.ఎస్‌.జగన్‌ వ్యాఖ్యలు సమర్థించుకోలేక...ఇటు కాపు నాయకులకు సమాధానం చెప్పలేక...సతమతమవుతున్నారు. నిన్న హైదరాబాద్‌లో ఇదే విషయంపై విలేకరులతో మాట్లాడిన పార్టీ సీనియర్‌ నేత 'అంబటి రాంబాబు' స్పందిస్తూ..రాష్ట్ర పరిధిలో లేని విషయం కనుక..'జగన్‌' చేయలేరని చెప్పారని...తాము మాట ఇచ్చి తప్పేది లేదని...'జగన్‌' బాటనే అనుసరించారు. చేయలేనిది.. చేయలేమని..చెప్పామని..దీనిలో తప్పేమిటని...ఆయన కెమెరాల ముందు వాదించారు. తరువాత మాత్రం ఇదే విషయంపై.. పార్టీలో చర్చ జరుగుతుందని, ఒకవేళ కేంద్రంపై పోరాడాల్సి వస్తే...అందరి వెంటే తామూ ఉంటామని...మెల్లగా అసలు విషయాన్ని ఆయన చెబుతున్నారు. ఇదే విషయాన్ని...'జగన్‌' నోటితో చెప్పించవచ్చు కదా..అనే ప్రశ్నకు ఆయన సమాధానాన్ని దాట వేశారు. కేంద్రంపై పోరాడైనా...కాపులకు రిజర్వేషన్‌ సాధిస్తాననే మాట...'జగన్‌' ఎక్కడా మాట్లాడకపోవడంపై...పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా...'జగన్‌' స్పందించడం లేదు. అంటే..ఈ విషయంలో 'జగన్‌' జాగ్రత్తగానే మాట్లాడారని, ఆయన మనస్సులో ఉన్నదాన్నే ఆయన చెప్పారని..మరి కొందరు నేతలు చెబుతున్నారు. 

  కాపులకు టిడిపి ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తూ...అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిందని, అసెంబ్లీ తీర్మానం అంటే...అన్ని పార్టీలతో కలిసే ఉంటుందని, దీనిలో తమ పార్టీ కూడా ఉందని...ఇదే విషయాన్ని వై.ఎస్‌.జగన్‌ వివరిస్తే..సమస్యే ఉండదు కదా...? కేంద్ర పరిధిలోని విషయంపై పోరాడదామని చెబితే...ప్రస్తుతం వస్తోన్న విమర్శలు ఉండేవి కాదని..కానీ..'జగన్‌' కావాలని...ఈ విషయంపై మాట్లాడారని, ఆయన మనస్సులో వేరే ఉద్దేశ్యాలు ఉన్నాయని దీనిని బట్టిస్పష్టం అవుతోందని.. ఓ సీనియర్‌ నాయకుడు 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌'తో వ్యాఖ్యానించారు. 'కాపులు' తనకు ఎలాగూ..ఒటేయరని.. అటువంటప్పుడు.. వారినిపట్టుకుని వేలాడే కంటే...బీసీలను మచ్చిక చేసుకుంటే..ఆ ఓట్లు తనకు వస్తాయనే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నారని..ఇక ఈ విషయంలో 'జగన్‌' వెనక్కు తగ్గరని..కాపు రిజర్వేషన్లపై ఆయన ఎదురుదాడే చేస్తారని ఆయన నాయకుడు విశ్లేషించారు. మొత్తం మీద..కాపుల విషయంలో 'జగన్‌' తీసుకున్న నిర్ణయం..పార్టీలోని కాపు నాయకులకు నిద్ర లేకుండా చేస్తోంది.

(315)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ