'లోకేష్‌'కు ఎర్త్‌ పెడుతున్న టిడిపి సీనియర్‌లు...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'లోకేష్‌'కు ఎర్త్‌ పెడుతున్న టిడిపి సీనియర్‌లు...!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు రాష్ట్ర పంచాయితీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చురుగ్గా ఉండడం..కొంత మంది టిడిపి సీనియర్‌ నాయకులకు ఇష్టం లేనట్లుంది. ఆయనను..రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు పంపించాలని..వారంతా..ఒక పద్దతి ప్రకారం ప్రచారం చేస్తున్నారట. ఆయన ఇక్కడ ఉంటే...ఎప్పటి నుంచో... పార్టీలో ఉంటున్న సీనియర్లకు ఇబ్బందిగా ఉంటోందట. ప్రతి విషయానికి 'లోకేష్‌' వద్దకు రావడానికి వారికి చిన్నతనంగా ఉందని ఫీల్‌ అవుతున్నారట. తమ కళ్ల ముందు పుట్టి పెరిగిన 'లోకేష్‌' వద్దకు వెళ్లి నిలబడడానికి, ఏమైనా అడగడానికి వారు ఇబ్బం దిగా, అసౌకర్యంగా ఉంటోందట. పాత తరానికి చెందని ఈ నాయకులు...పార్టీలో నెంబర్‌టూగా ఉన్న 'లోకేష్‌'తో వ్యవహరిం చడం..కష్టంగా ఉందోంట. నవతరానికి ప్రతినిధి అయిన 'లోకేష్‌' ఆలోచనా విధానాన్ని..ఈ సీనియర్‌ నాయకులు ఒంటబట్టించు కోవడం లేదు. దీంతో..'లోకేష్‌'కు వారికి మధ్య..చిన్న చిన్న విభేదాలు, అపార్ధాలు వస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను జాతీయ రాజకీయాల్లోకి పంపించాలని..ఒక పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నారట. ఈ విషయంలో పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులతో పాటు..ఇటీవల కాలంలో ఇతర పార్టీల నుంచి టిడిపిలో చేరిన నాయకులు కూడా ఉన్నారట. ముగ్గురు సీనియర్‌ మంత్రులు ఈ విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారనే మాట పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

  జాతీయ రాజకీయాల్లోకి 'లోకేష్‌' వెళితే...ఆయన అనుభవాన్ని బాగా సంపాదించుకుంటారని వారు చెబుతున్నారట. ఆయన వచ్చే ఎన్నికల్లో..పార్లమెంట్‌కు పోటీ చేసి..ఎన్నికల్లో గెలిస్తే...కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని, దానిలో మంత్రిగా 'లోకేష్‌' పనిచేస్తే...ఆయనకు అనుభవం వస్తుందని, తద్వారా..రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా ఆయన బాగా పరిపాలన చేస్తారని, ఇది అందుకు ఉపయోగపడుతుందని వారు విశ్లేషిస్తూ..అధినేతకు సలహాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. కొందరు జాతీయ నేతల పుత్రరత్నాలను, వారసత్వాలను అందిపుచ్చుకున్న వారిని దీనికి ఉదాహరణగా వారి చూపిస్తున్నారు. ఎస్పీ అధినేత 'ములాయం సింగ్‌' తనయుడు 'అభిషేక్‌యాదవ్‌' ఈ విధంగానే ఎంపీగా ఉండి..తరువాత సిఎంగా రాణించారని..వారు ఉదాహరిస్తున్నారు. ఎంపీగా పనిచేసి..సిఎంగా చేసిన 'అభిషేక్‌' నిర్వాకాన్ని 'దేశం' మొత్తం చూసింది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో..ఎస్పీ ఎంత ఘోరపరాజయాన్ని చవిచూసిందో..ఈ నేతలు మరిచిపోయినట్లున్నారని కొందరు టిడిపి నాయకులు చెబుతున్నారు. కేవలం ఎంపీగా పనిచేస్తేనే...అనుభవం వస్తుందనేది అపోహేనని..ప్రస్తుతం 'లోకేష్‌' మంత్రిగా బాగానే రాణిస్తున్నారని, ఆయనపై అనవసరంగా ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదని 'లోకేష్‌'ను సమర్థించే నేతలు చెబుతున్నారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేస్తే..జాతీయ స్థాయిలో ఇమేజ్‌ వస్తుందని..వారు చెబుతున్నారని..కానీ..ఈ పదవులేమీ చేయకుండానే...'చంద్రబాబు నాయుడు' దేశ,అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్‌ సంపాదించుకున్నారని, ఇటువంటి తలతిక్క ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదని, ఇదంతా ఒక పద్దతి ప్రకారం 'లోకేష్‌'ను ఇక్కడ నుంచి తప్పించడానికి చేస్తోన్న ప్రయత్నమని వారు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా...'చంద్రబాబునాయుడు' ఈవిషయం గురించే ఆలోచించరని...ఇదంతా కొందరు కావాలని చేస్తున్నదని వారు అంటున్నారు.

(611)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ