'నేనేం...పాపం...చేశాను...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నేనేం...పాపం...చేశాను...!

'నేనం..పాపం..చేశాను...! నా మీద ఎందుకీ కక్ష...? నా కెందుకు టిక్కెట్‌ ఇవ్వమని...చెబుతున్నారు..? అధిష్టానం చెప్పినట్లా... చేశాను కదా...? ఎందుకు నా పరువు తీస్తున్నారు..? నాకు టిక్కెట్‌ ఇవ్వనని..పదిమందిలో ఎందుకు అధినేత వ్యాఖ్యా నిస్తున్నారు...? సొంత బాబాయి...అయిన తనపైనే ఎందుకీ విధమైన సాధింపులు..? అంటూ...ఒంగోలు మాజీ ఎంపి వైవి సుబ్బా రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇటీవల కాలంలో ఆయనకు టిక్కెట్‌ ఇవ్వనని...వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్‌ తనను కలిసిన వారికి..కలవని వారికి కూడా చెబుతున్నారట. 'బాబాయికి...మళ్లీ పోటీ చేయరు...? అక్కడ నుంచి గెలిచే అభ్యర్థిని చూడండి...? అంటూ..ఆయన తన సన్నిహితులతోనూ...ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితోనూ వ్యాఖ్యానిస్తున్నారట. ఒంగోలుకు చెందిన పదిమంది వైకాపా నాయకులు కనిపిస్తే...'జగన్‌' ఇదే మాటలు చెబుతున్నారట. ఇదేమిటి...సొంత బాబాయి.. పైన 'జగన్‌'కు ఎందుకు ఇంత కక్ష...? ఆయనేం చేశారు..అని కొంత మంది నాయకులు...అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారట. 'సుబ్బారెడ్డి'కి...'జగన్‌'కు మధ్య విభేదాలకు కారణమేమిటి..? ఆయనేం చేశారనే దానిపై రకరకాలుగా వైకాపా నాయకులు చర్చించుకుంటున్నారట.

  గత సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన వై.వి.సుబ్బారెడ్డి అతికష్టంపై విజయం సాధించగలిగారు. అయితే...ఆయన పార్టీ అభ్యర్థులను, తనకు పోటీ అవుతారనే వారిని ప్రత్యర్థులతో చేయి కలిపి ఓడించారనే మాట పార్టీ నాయకుల్లో ఉంది. ముఖ్యంగా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి(వాసు) ఓటమికి ఆయన సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని 'వాసు' అధినేత 'జగన్‌' దృష్టికి తీసుకెళ్లారని..అప్పట్లో ఈ విషయంపై పెద్ద వివాదమే జరిగింది. తరువాత...నెమ్మదిగా కుదురుకున్నా...'వై.వి.సుబ్బారెడ్డి' వ్యవహారశైలిపై అలకచెందిన 'వాసు' ఒంగోలును విడిచి..హైదరాబాద్‌ వెళ్లిపోయారు. పార్టీ కోసం తన ఆస్తులను అమ్ముకున్నానని, అటువంటి తనకే వెన్నుపోటు పొడిచారని...'వాసు' ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో టిడిపిలో చేరాలని..ఆయన భావించి..అంతా సిద్ధం చేసుకున్నా..'జగన్‌' వారించడంతో...ఆగిపోయారు. తరువాత కూడా పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోని 'వాసు' ఇటీవల 'జగన్‌' హామీతో..మళ్లీ క్రియాశీలకంగా మారారని..పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 'వాసు,వై.వి.సుబ్బారెడ్డి' మధ్య ఉన్న విభేదాల వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందని భావించిన 'జగన్‌'..వై.వి.కి టిక్కెట్‌ ఇవ్వనని ముందు నుంచే చెబుతున్నారట. ఆయన పార్టీ వ్యవహారాలు చూసుకుంటారు..ఎన్నికల్లో పోటీ చేయరని 'వాసు'కు హామీ ఇచ్చిన తరువాతే...'వాసు' బరిలోకి దిగారని..పార్టీలోని కొందరు నేతలు ప్రచారం చేస్తున్నారు. 

  కాగా..మరో మాట కూడా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇటీవల కాలంలో 'జగన్‌' పార్టీ పరంగా చేస్తోన్న తప్పులను 'వై.వి.సుబ్బారెడ్డి' ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నారని, దీంతో..'జగన్‌' ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇటీవల వైకాపా ఎంపీలు..తమ పదవులకు రాజీనామా చేసి వచ్చినప్పుడు..వై.వి.సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారట. ఇటువంటి రాజకీయాలు ఎవరీ చేయరని..'జగన్‌'ను విమర్శించారట. ఈ విషయం తెలిసిన 'జగన్‌' ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగిందని..దీంతో..'జగన్‌' తన నిర్ణయం తాను తీసుకున్నారని తెలుస్తోంది. కాగా...'జగన్‌' తీసుకున్న నిర్ణయంపై...వై.వి.సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తానేం చేశానని...తనకు టిక్కెట్‌ ఇవ్వనని 'జగన్‌' అంటున్నారో తెలియడం లేదని..టిక్కెట్‌ ఇవ్వకపోతే..చూస్తూ..ఊరుకోబోనని..త్వరలో నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని.. చెబుతున్నారట. జిల్లా వెనుకబాటును కారణంగా చూపి...వై.వి.సుబ్బారెడ్డి పాదయాత్ర చేస్తానని చెబుతున్నా..ఆయన లక్ష్యం టిక్కెట్‌ సాధించడమేనని..వైకాపాలోని ఆయన వ్యతిరేకులు అంటున్నారు. మొత్తం మీద..వై.వి.సుబ్బారెడ్డి...వ్యవహారం పార్టీలో తీవ్ర కలకలానికి కారణమవుతోంది.

(2648)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ