'కోహ్లీ' మాస్టర్‌ సెంచరీ...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కోహ్లీ' మాస్టర్‌ సెంచరీ...!

అబ్బ...ఏమని..వర్ణించగలం..ఆ...ఆటను..చూడడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు..సహచరులం దరూ...పెవిలియన్‌ బాట పడుతుంటే...అతనొక్కడే..నిబ్బరంగా...క్లాస్‌గా...సెంచరీ చేసి...జట్టును ఆపద నుంచి గట్టెక్కించాడు. అందుకే..అతనో...క్లాస్‌ ఆటగానికి సింబల్‌. ఇంగ్లాండ్‌లో..అతని ఘనత గతంలో పెద్దగా లేదు. పేరుకి..పెద్ద బ్యాట్స్‌మెన్‌. అరివీర భయంకరుడు..కానీ..బ్రిటన్‌గడ్డపై...మాత్రం సగటు బ్యాట్స్‌మెన్‌ కన్నా ఘోరం..అయితేనేం..ఈ రోజు తనలోని క్లాస్‌ ఆటను బయటకు తీశాడు. ఒక వైపు తోటి బ్యాట్స్‌మెన్‌ విఫలమై విక్కెట్లు సమర్పించుకుంటుంటే..అతను మాత్రం అదేమీ పట్టనట్లు తన ఆట తాను ఆడి..జట్టును ఇంగ్లాండ్‌తో సమానంగా నిలిపాడు. కెప్టెన్‌ ఇన్సింగ్‌ అంటారే..ఇదే..ఆ కెప్టెన్‌ ఇన్సింగ్స్‌...! మొత్తానికి తానెందుకు ప్రపంచ్‌ నెంబర్‌వన్‌ బ్యాట్స్‌మెన్‌ మరోసారి చాటి చెప్పాడు..భారత్‌ కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ...!

 వంద పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో ఉన్న భారత్‌ను ఇంగ్లాండ్‌ స్కోరు సమీపాన తేవడం ఆషా మాషీ కాదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న...ఓపెనర్లు..తక్కువ స్కోరుకే వెను తిరిగినా...కోహ్లీ మాత్రం పట్టువిడవలేదు. ధావన్‌, మురళీవిజయ్‌, కెఎల్‌ రాహుల్‌, దినేష్‌కార్తీక్‌,రెహానాలు వంద పరుగుల లోపే అవుట్‌ అయ్యారు. ఇక భారత్‌ 150 పరుగులకే ఆలౌట్‌ అవుతుందని అందరూ భావించారు. అయితే కెప్టెన్‌ కోహ్లీ తనదైన శైలిలో ఆడుతూ..పరుగుల వర్షం కురిపించాడు. మంచి బంతులను వదిలేస్తూ..గతి తప్పిన బంతులను బౌండరీలకు పంపుతూ..మెల్లగా అర్థ సెంచరీ సాధించాడు. ఈ లోపు..పాండ్యా కూడా అవుట్‌ అయ్యాడు. అప్పటికి భారత్‌ 148 పరుగులు మాత్రమే చేసింది. తరువాత ఉన్న వారంతా..బౌలర్లే..కానీ..కోహ్లీ తనలో మాస్టర్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌ను బయటకు తీసి..అనుభవాన్ని రంగరించి ఆడాడు. తుది బ్యాట్స్‌మెన్‌ను రక్షించుకుంటూ.. సెంచరీ దిశగా సాగాడు. సెంచరీ అనంతరం కూడా...ఇంగ్లాండ్‌కు భారత్‌కు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించుకుంటూ వెళ్లాడు. చివరకు రషీద్‌ బౌలింగ్‌లో అవుట్‌ అవడంతో..భారత్‌ ఇంగ్లాండ్‌ కన్నా..కేవలం 13 పరుగులు మాత్రమే వెనకబడి ఉందంటే..అది కోహ్లీ పుణ్యమే. రెండో ఇన్సింగ్స్‌ ప్రారంభించిన బ్రిటన్‌ 9 పరుగులకు ఒక వికెట్‌ కోల్పోయింది.మొత్తం మీద..ఎన్నాళ్ల నుంచో..ఇంగ్లాండ్‌ గడ్డపై రాణించలేని..కోహ్లీ ఒక మాస్టర్‌ సెంచరీతో..తనపై ఉన్న అప్రదను పోగొట్టుకున్నారు.

(142)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ