లేటెస్ట్

అవినీతిలో తెలంగాణాకు ఐదవ స్థానం...!

దేశంలో అవినీతి రోజు రోజుకు పెరిగిపోతోందని, ప్రతి ఇద్దరు భారతపౌరుల్లో ఒకరు లంచాలు ఇస్తున్నారని 'ట్రాన్స్‌పర్సెన్నీ ఇంటర్నేషనల్‌ ఇండియా'(టిఐఐ) అనే సంస్థ వెల్లడించింది. ప్రతి ఏడాది అవినీతిపై ఈ సంస్థ ర్యాంకులు ప్రకటిస్తుంది. 2019వ సంవత్సరంలో దేశంలోనే ఐదు అవినీతి రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. మొదటి స్థానంలో 'రాజస్తాన్‌' ఉండగా తరువాత స్థానాల్లో 'బీహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, తెలంగాణ'లు నిలిచాయి. మొత్తం 28 రాష్ట్రాలకు కాను 20 రాష్ట్రాల్లో ఈ సంస్థ దాదాపు 1,90,000 మంది పౌరులను అడిగి అవినీతిపై సర్వేను నిర్వహించింది. 2018వ సంవత్సరం కన్నా 2019వ సంవత్సరంలో కొంత అవినీతి తగ్గినా..2017వ సంవత్సర అవినీతి కన్నా ఇది ఎక్కువే. సర్వేలో పాల్గొన్న పౌరులను అవినీతి గురించి ప్రశ్నించగా తాము గత 12 మాసాల్లో పలుసార్లు వివిధ పనుల కోసం లంచాలు ఇచ్చామని చెప్పారు. 24శాతం మంది పలుసార్లు లంచాలు ఇచ్చామని చెప్పగా, 27 శాతం మంది మాత్రం ఒకటి లేదా రెండుసార్లు లంచాలు ఇచ్చుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లు, భూముల విషయంలోనే భారీగా లంచాలు మింగుతున్నారని సర్వేలో పాల్గొన్న వారిలో పావు వంతు మంది చెప్పారు. స్థానిక సంస్థలకు చెందిన అధికారులు, పోలీసులు 19శాతం లంచాలు వసూలు చేస్తున్నట్లు సర్వే పేర్కొంది. టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌, ట్రాన్స్‌ఫోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ మరియు ఇతర స్థానిక సంస్థల అధీకృత అధికారులు లంచాలు వసూలు చేస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న పౌరులు తెలిపారు. 

  ప్రభుత్వం అవినీతిని తగ్గించేందుకు అవినీతి నిరోధకబిల్లును తెచ్చి, అవినీతిపరులపై ఉక్కుపాదం మోపుతామని చెబుతున్నా..అవినీతి పరుల్లో మాత్రం మార్పు రాలేదు. ప్రభుత్వం నూతనంగా తెచ్చిన చట్టం వల్ల కొన్నాళ్లు అవినీతి తగ్గినా మళ్లీ ఎప్పటిలానే ఉందని సర్వే పేర్కొంది. 6శాతం మంది ప్రజలు తమ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అవినీతిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాయని తెలిపినా అవినీతి మాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. 2016లో ప్రధాని నరేంద్ర మోడీ అవినీతిని తగ్గించేందుకు అప్పటి వరకు ఉన్న వెయ్యి, ఐదు వందల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ నోట్ల రద్దువల్ల కొద్దిగానైనా అవినీతి తగ్గలేదని,పైగా చిన్న వ్యాపారులపై నోట్ల రద్దు ప్రభావం పడిందని సర్వే తెలిపింది. 

(345)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ