WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తెలంగాణ రైతు మీదే రుణభారం ఎక్కువ...!

ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల కంటే తెలంగాణ రైతుల మీదే రుణభారం ఎక్కువగా ఉందని 'జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) తాజా విడుదల చేసిన ఒక నివేదికలో స్పష్టం చేసింది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న రైతులు, గ్రామీణుల జీవన పరిస్థితులపై, వారికి అందుతున్న ఆర్థిక సేవలపై సర్వే నిర్వహించారు. 'అఖిల భారత గ్రామీణ సమ్మిళత ఆర్థిక సర్వే -2016-17'లో రైతు కుటుంబాల స్థితిగతులు, గ్రామీణుల స్థితిగతులపై సర్వే అధ్యయనం చేసింది. దేశంలోని రైతు కుటుంబాలకు ఆదాయం ఎలా వస్తుంది...ఎంత వస్తుంది...వారు అప్పులు ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు..వాటిని ఎలా తీరుస్తున్నారనే దానిపై సర్వే విశ్లేషించింది. నాబార్డ్‌ సర్వే ప్రకారం...తెలంగాణలో రైతులు ఎక్కువ వడ్డీలకు అప్పులు తెస్తున్నారని తేలింది. దేశ వ్యాప్తంగా రైతు కుటుంబాలు తెచ్చే అప్పుల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తేలింది. మొత్తం రైతుల్లో 79శాతం మంది రుణభారాన్ని మోస్తున్నారని సర్వే స్పష్టం చేసింది. వీరంతా స్థానిక వడ్డీ వ్యాపారుల నుంచి, ప్రైవేట్‌ సంస్థల నుంచి అప్పులు తెచ్చారని తెలిపింది. ఇది ఇలా ఉంటే..ఆంధ్రా రైతులు కూడా 76శాతం మంది రుణం భారంతో మగ్గిపోతున్నారని, తరువాత కర్ణాటక 75శాతం, తమిళనాడు 61శాతం, కేరళ 56శాతంతో రైతులు అప్పుల్లో మగ్గిపోతున్నారని నివేదిక స్పష్టం చేసింది. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే..దక్షిణాది రైతుల్లోనే ఎక్కువగా అప్పుల భారం ఉన్నట్లు తెలుస్తోంది.

జాతీయ సగటు కన్నా..తెలంగాణ ఎక్కువే...!

విచిత్రంగా రైతు కుటుంబాల ఆదాయంలో..జాతీయ సగటు కన్నా...తెలంగాణ రైతు కుటుంబం ఆదాయం ఎక్కువట. రైతు కుటుంబాల  ఆదాయంలో జాతీయ సగటు రూ.8931/-లు అయితే...తెలంగాణ రైతు సగటు ఆదాయం రూ.8951/-లు సర్వే తేల్చింది. రైతు కుటుంబాల ఆదాయం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ఘోరంగా వెనుకబడిపోయింది. ఆంధ్రాలో రైతు కుటుంబాల సగటు ఆదాయం రూ.6920/- మాత్రమే. ఇది జాతీయ సగటు కన్నా... రూ.2031/-లు తక్కువ. వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులపై, వ్యవసాయంపై ఖర్చు చేస్తున్నామని చెప్పుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ అంకెలు చూసి సిగ్గుపడాల్సిందే. కాగా..రైతులపై రుణభారం రోజు రోజుకు పెరిగిపోతుందని, దీన్ని వెంటనే తగ్గించాల్సిన అవసరం ఉందని సర్వే చెబుతోంది. రుణభారంతోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతుల ఆత్మగౌరవ సమస్యగా వారు రుణాలను పరిగణిస్తున్నారని తెలంగాణ, ఆంధ్రాలో రైతు ఆత్మహత్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సర్వే తన నివేదికలో పేర్కొంది.  

(378)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ