WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తెలంగాణలో 'పవన్‌' యాత్ర కోసం...కెసిఆర్‌ ఆరాటం...!

అవును..వాళ్లిద్దరూ..రెండు రాజకీయపార్టీలకు అధ్యక్షులు. ఎవరి పార్టీ వారిదే..ఎవరి సిద్ధాంత వారిదే. ఎవరి ఓట్లు వారివే...? ఎవరి అభిమానులు వారికే...కానీ...వారిద్దరూ మాత్రం కలసి పనిచేస్తారు..? అధికారికంగా మాత్రం కలవరు..? లోపాయికారి ఒప్పందం ఉంటుంది...? ఆ ఒప్పందంతో మరోసారి..అధికారంలోకి రావాలని మరోపార్టీ అధినేత కోరుకుంటున్నారు..ఇంతకీ వారెవరంటా.. వారెవరో కాదు.. వారిలో ఒకరు అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కాగా..మరొకరు..సినీనటుడు, జనసేన అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌'లు.

  తెలంగాణలో..ఎదురు లేకుండా దూసుకుపోతున్న కెసిఆర్‌కు..ఇప్పుడు సినీనటుడు 'పవన్‌కళ్యాణ్‌' అవసరమొచ్చింది. ఆయన తమ రాష్ట్రంలో పర్యటించాలని ఆరాటపడిపోతున్నారు. అదేమిటి..ఇతర పార్టీ అధ్యక్షుడు పర్యటిస్తే..టిఆర్‌ఎస్‌కే దెబ్బ కదా..ఎందుకు..ఆయనను కెసిఆర్‌ ఆహ్వానిస్తున్నారు..? ఇదేమి మతలపు..అనుకుంటున్నారా..? అవును దీనిలో మతలబు ఉంది...? పేరుకు ప్రత్యర్థులు..! ప్రత్యర్థుల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 'జనసేన' అభ్యర్థులను నిలిపితే...టిఆర్‌ఎస్‌కు లాభం కలుగుతుందట. రాష్ట్ర వ్యాప్తంగా 'పవన్‌కళ్యాణ్‌'కు కొన్ని వర్గాల్లోనూ, ఆయన అభిమానుల్లో ఓటర్లు ఉన్నారు. వీరు వచ్చే ఎన్నికల్లో 'జనసేన'కు ఓటు వేయాలని...కెసిఆర్‌ అభిలాషిస్తున్నారు. 

  ఆయన ఎందుకు ఆ విధంగా ఆకాక్షిస్తున్నారంటే..వచ్చే ఎన్నికల్లో..కాంగ్రెస్‌కు తమకు మధ్య...హోరాహోరి పోటీ ఉంటుందని..ఆ పోటీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు..కాంగ్రెస్‌కు కాకుండా.. 'జనసేన' వంటి గెలవలేని పార్టీలకు పడితే...తనకు లాభమనే భావనతో కెసిఆర్‌ ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పలు పార్టీల మధ్య చీలిపోతే...టిఆర్‌ఎస్‌ను అభిమానించే ఓటర్ల ఓట్లు గంపగుత్తగా తనకే పడతాయని, ఉద్యమ సమయం నుంచి ఉన్న వర్గాలు..తనను అనుసరిస్తాయని..అప్పుడు తన విజయం సునాయాసం అవుతుందని...కెసిఆర్‌ భావిస్తున్నారు. దీని కోసమే ..తెలంగాణలో 'పవన్‌' పర్యటించాలని ఆయన భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే...'పవన్‌'తో ఆయన చర్చించారు. 'పవన్‌' సామాజికవర్గానికి చెందిన ఓటర్లు...'పవన్‌'కు ఓటువేస్తారని, వారితో పాటు..ప్రభుత్వ వ్యతిరేక ఓటు వివిధ చిన్న పార్టీల మధ్య చీలిపోతే సంస్థాగతంగా ఉన్న బలంతో తన గెలుపు ఈజీ అవుతుందని..కెసిఆర్‌ అంచనా. అందుకే..'పవన్‌'ను తెలంగాణలో పర్యటించాలని..కోరుతున్నారు.  

(1319)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ