WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కెసిఆర్‌'కు ఓటమి భయం...!?

ఐదేళ్లు పరిపాలించమని...అధికారం చేతిలో పెడితే...పాలించడం చేతకాక...ఎనిమిది నెలలు ముందే...ఎన్నికల్లో..అంటూ... హడావుడి చేస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ తెచ్చిన వాడిగా భావించి..నాడు తెలంగాణ 'జనం' ఆయనకు ఓటు వేస్తే...ఈ నాలుగేళ్లలో మాటలతో కాలం వెళ్లబుచ్చి..ఇప్పుడు హఠాత్తుగా...ఎన్నికలకు తెరతీయడం వెనుక ఆయనకు ఓటమి భయమే కనిపిస్తోంది. నాలుగేళ్లలో ఎన్నో మంచిపనులు చేశామని చెప్పుకుంటున్న..ఆయన మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది...? నాలుగేళ్లలో తెలంగాణ 'బంగారు తెలంగాణ' అయితే...ఎనిమిది నెలలు ముందే ఎన్నికలు ఎందుకు...? ఎన్నికల కోసం 'మోడీ' చుట్టూ..తిప్పలు ఎందుకు...? ప్రజలు ఇప్పుడు బ్రహ్మాండంగా ఆదరిస్తే...హడావుడిగా ఎన్నికలు ఎందుకు..? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..వంద సీట్లు వస్తాయని రొమ్ములు విరగదీసుకుని చెబుతున్న కెసిఆర్‌ అండ్‌ కోకు..మరో ఆరు నెలల్లో ప్రజల తమను ఛీ కొడతారనే భయం ఎందుకు..? చేసిన పనులను..ఆరు నెలల్లోనే ప్రజలు మరిచిపోతారనే భయమా..? లేక ఏమీ చేయకుండానే...చేశామని చేస్తున్న కలరింగ్‌ తొలిగిపోతుందన్న భయమా..? నాలుగున్నరేళ్ల టిఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధిపథంలో శరవేగంగా పరుగులు తీస్తుంటే..సకాలంలో దర్జాగా ఎన్నికలకు వెళ్లి..ప్రజల తీర్పు కోరవచ్చు కదా..? ఇప్పుడు మధ్యలో ఎన్నికల కమీషన్‌, మోడీ, ఇతర అధికారుల కాళ్ల చుట్టూ..అధికారులను,ఎంపీలను తిప్పికోవాల్సిన అవసరం ఏమిటి..? నాలుగేళ్ల పాలనలోప్రజలకు ఒరిగించిదేమీ లేదన్న భయంతోనే ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికల పాట పాటడాన్ని ప్రజలు గమనించడం లేదనుకుంటే పొరపాటే...?

  తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర హామీ నెరవేరిన తరువాత..ప్రజలకు ఒరిగిదేముంది. ఈ నాలుగేళ్లల్లో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చింది. తెలంగాణ వచ్చిన తరువాత ఇస్తామన్న 'లక్ష' ఉద్యోగాల మాటేమైంది...? ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోయిన..తరువాత ఇస్తామన్న ఉద్యోగాలు..ఏవి..? నాడు 'ఆంధ్రులను' తరిమిస్తే..ఇంటికో ఉద్యోగం వస్తుందన్న మాటలు ఏమయ్యాయి...? నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం నాడు పెట్టిన కొట్లాటాల ఫలితమేది..? తెలంగాణ వచ్చిన తరువాత..పారించిన నీరెంత..? ఎన్ని వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి...? తెలంగాణలో ఆత్మహత్యలే ఉండవన్న మాటలు నేడేమయ్యాయి. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే నెంబర్‌ టూ స్థానంలో తెలంగాణ ఎందుకు ఉంది...? దళితులకు ఇస్తామన్న మూడెకరాల పొలం ఏమైయింది. కరీంనగర్‌ను లండన్‌స్థాయి నగరంగా మారుస్తామన్న హామీ ఏమైంది....? టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత..వాళ్లు చేసిందీ..ఇదీ అని గర్వంగా చెప్పుకునే పని ఒక్కటైనా ఉందా..? బంధుప్రీతి, అవినీతితో సర్వవ్యవస్థలు కూలిపోయిన తరువాత...ఏమీ చేయలేక..ఇప్పుడు..హఠాత్తుగా..ఎన్నికల రాగం అందుకోవడంలోనే కెసిఆర్‌ ఏం చేస్తున్నారో తెలిసిపోతోంది. తెలంగాణ వచ్చిన మొదట్లో..సర్వం..తెలంగాణ వారికే..ఇస్తామన్న యుద్ధప్రాతిపదికన సర్వజన సర్వే పేరిట మొదలైన వీధి బాగోతం రోజు రోజుకు పెరిగిపోయిందే తప్ప..ప్రజలకు నిజంగా ఒరిగించిందేమిటో..హైదరాబాద్‌ ఎన్నికల సందర్బాన..డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామన్న వాగ్ధానంతో ఓట్ల వర్షం కురిపించుకున్న అధికార పార్టీ...తరువాత ఎన్ని డబుల్‌బెడ్‌రూమ్‌లు ఇచ్చారో..చెప్పాలి.  ప్రచారసాధానలపై ఉక్కుపాదం మోపి..తనకు అనుకూలంగా లేనివారిపై కక్ష కట్టి..ప్రజల కంతా బాగుందని చెప్పిన ఏలికలు..ఇప్పుడు..అసలైన ప్రజల తీర్పును..చూడబోతున్నారు. అందుకే ఇప్పుడు..మరోసారి..వారిని మాయచేయడానికి..ముందస్తు నాటకాన్ని తెరపైకి తెస్తున్నారు.

(322)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ