WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బలహీనతలను బయటపెట్టుకున్న కెసిఆర్‌...!

మేక..పులితోలు కప్పుకుంటే...పులి అయిపోతుందా...? అచ్చం..అలానే ఉంది..తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిస్థితి. నిన్నటి దాకా...మీడియాను బెదిరించి...బిస్కట్స్‌వేసి...అదుపులోకి తెచ్చుకుని..తెలంగాణలో తనకు ఎదురులేదని... చెప్పుకున్న...కెసిఆర్‌కు నిన్నటి సభతో స్పష్టమైంది...తాను 'పులి'ని కాదని..మేకనని...?  పాలించమని..అధికారం అప్పచెబితే..నాలుగేళ్లల్లో ఏమీ చేయలేక..ముందస్తు..ఎన్నికలంటూ..ఆరు నెలల నుంచి ఒకటే..ఊదరగొడుతున్న...కెసిఆర్‌ అండ్‌ కోకు తెలంగాణ సమాజం తమ వైఖరేమిటో..స్పష్టం చేసింది. వందల కోట్లు ఖర్చుపెట్టి...నెలల ముందే..సభ నిర్వ హిస్తున్నామని చెప్పినా..ప్రజల నుంచి ఆశించిన స్పందన ఎందుకు రాలేదు...? సభకు వచ్చిన ప్రతివారీకి ఫారిన్‌ విస్కీ పోయిం చినా..వారు ఎందుకు సభలో మమేకం అవ్వలేదు...? ఏదో చేద్దామని..ప్రజలను ఒప్పించి..ముందస్తుకు వెళదామని..భావించిన 'కెసిఆర్‌' ఎందుకు..నోరెత్తలేకపోయారు....? అసలు ఇది కెసిఆర్‌ సభేనా..?అని తెలంగాణ వాదులే అనుకునే విధంగా ఎందుకు సభ జరిగింది..? ఎక్కడ తేడా కొట్టింది..? ప్రజలకు కెసిఆర్‌పై ఉన్న భ్రమలు తొలిగిపోయాయా..? నాలుగున్నరేళ్లల్లో ఎంతో చేశామని..చెపుతోన్న 'కెసిఆర్‌' మాటలు వట్టిమాటలేనా...? అంటే సమాధానం అవుననే వస్తోంది.

  నాలుగున్నరేళ్ల టిఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిటి..? తెలంగాణ వస్తే..సకల సమస్యలు పరిష్కారం అవుతాయన్న కెసిఆర్‌ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో సాధించిదేమిటి..? నిధులు, నీళ్లు, కొలువులే తమ తెలంగాణ అజెండా అని చెప్పిన 'కెసిఆర్‌' అధికారంలోకి వచ్చిన తరువాత..ఎంత మందికి కొలువులు ఇచ్చారు...? ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారు..? ఇచ్చిన హామీల్లో నెరవేర్చినవి ఏవి..? బంగారు తెలంగాణ అన్న కెసిఆర్‌ నేడు..తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై నోరెందుకెత్తడం లేదు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే నెంబర్‌ టూ స్థానంలో తెలంగాణ ఉన్నా...అసలేమీ జరగలేదన్నట్లు కెసిఆర్‌ వ్యవహరిస్తున్నా..బాధలు అనుభవిస్తున్న వారికి తెలియదా..? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కుటుంబం పాలైన సంగతి..తెలంగాణ సమాజం గ్రహించడం లేదా..? అమాయక తెలంగాణ 'జనం' ఏది చెప్పినా నమ్ముతారనే భావనతోనే..కదా..ముందస్తు హడావుడి పెట్టింది. ముస్లింలకు ఇస్తానన్న రిజర్వేషన్లు ఏమయ్యాయి...? వందలకోట్లతో సభ నిర్వహించి సక్సెస్‌ అయితే..తన పాలనా లోపాలు మరుగునపడిపోతాయా..? సభతో హోరెత్తించాలని భావించిన ఆయనకు ఇప్పుడా సభే గుదిబండగా తయారైంది. సభ అట్టర్‌ ప్లాప్‌ అవడంతో...ఎన్నికలకు వెళితే...ఓటమి ఖాయమనే సంగతి తేలిపోవడంతో..కిందా మీదా పడే పరిస్థితిని కెసిఆర్‌ స్వయంగా కొని తెచ్చుకున్నారు. నిన్నటి దాకా..ఎన్నికలు ఎప్పుడు జరిగినా..కెసిఆర్‌కు కనీసం 45 నుంచి 50 సీట్లు వస్తాయని ఆయనను వ్యతిరేకించే వారు కూడా నమ్మారు. కానీ..నిన్నటి సభతో..అదంతా ఒట్టిమాటగానే తేలిపోవడంతో..కాంగ్రెస్‌, ఇతర పక్షాలు పుంజుకునే అవకాశాన్ని కెసిఆర్‌ స్వయంగా ప్రతిపక్షాలకు ఇచ్చారు. భారీగా నిర్వహించాలని తలపెట్టిన బహిరంగసభతోనే తన బలహీనతలను కెసిఆర్‌ బయటపెట్టుకున్నారనే మాట సర్వత్రా వినిపిస్తోంది.  

(268)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ