WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తెలంగాణ అసెంబ్లీ రద్దుపై 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' చెప్పిందే నిజమైంది...!

'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనం మరోసారి నిజమైంది. వాస్తవాలకు అద్దం పడుతూ...'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ఇంతకు ముందు ఎన్నో సంచలన కథనాలను ప్రచురించింది. విశ్వసనీయతకు పెట్టింది పేరైన 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' తెలంగాణ అసెంబ్లీ రద్దు గురించి...మిగతా ప్రసార సాధనాల కన్నా ముందే తెలిపింది. తెలంగాణ అసెంబ్లీనీ సెప్టెంబర్‌ మాసంలో రద్దు చేయబోతున్నారని... 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' గత ఆగస్టు13వ తేదీన ప్రచురించింది. 'సెప్టెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ రద్దు' అనే శీర్షికన ఆగస్టు13వ తేదీన ఆ కథనం ప్రచురితమైంది (వివరాలకు..అప్పటి సంచికను ఇస్తున్నాం...ఇక్కడ http://www.janamonline.com/article?nid=4782 చూడండి) ఆగస్టు 13నే 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' అసెంబ్లీ రద్దు గురించి వార్త ప్రచురిస్తే..అప్పట్లో దీన్ని చాలా మంది తేలికగా కొట్టేశారు. దీనిలో ఏముంది...ఏదో సంచలనం కోసం రాస్తారు..అంటూ...కొంత మంది కొట్టిపడేశారు. కానీ..సరైన సమాచారం, సరైన విశ్లేషణ వల్లే..ముందస్తుగానే ఆ వార్తను 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించింది. స్వల్పమైన వనరులతోనే సమాచార సేకరణలో ముందుండడం వల్లే..ఆ వార్తను ప్రచురించగలిగాం..అంతే తప్ప..ఏదో గాలి వాటుగా రాసిన వార్త కాదని స్పష్టం చేస్తున్నాం. ఇప్పుడు..కొన్ని ఛానెల్స్‌ తామే ముందుగా సెప్టెంబర్‌లో తెలంగాణా అసెంబ్లీని రద్దు చేస్తున్నారని చెప్పామని భుజకీర్తులు తొడుక్కుంటున్నాయి. గత వారం పది రోజుల నుంచి మాత్రమే వీరు..తెలంగాణ అసెంబ్లీ రద్దు అంటూ కథనాలు మొదలు పెట్టారు. కానీ..'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' గత నెల రోజుల కిందటే ఆ విషయాన్ని స్పష్టం చేసింది.  

(233)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ