WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నెల్లూరులో మంత్రి 'సోమిరెడ్డి' పవర్‌ కట్‌...!

నెల్లూరు జిల్లాలో ఓటర్లలో పట్టున్న నాయకుల్లో ఎక్కువ మంది వైకాపాలో చేరిపోవడంతో...అంతంత మాత్రమే ఉన్న తెలుగుదేశం బలం తగ్గిపోయిందని తెలుసుకున్న చంద్రబాబు ఆ జిల్లాలో చికిత్సమొదలు పెట్టారు. తన మనసులో ఉన్న అభిప్రాయాలను కొన్నింటిని మాత్రమే నాయకులకు చెబుతూ..మిగతా విషయాలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని తెలుసుకున్న చంద్రబాబు ఆయనను నియోజకవర్గం దాడి వెళ్లవద్దని..ఎన్నికల్లో గెలిచే మార్గాలను చూసుకోవాలని చెబుతూ..అధికారాలను కత్తెర వేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. జిల్లా పార్టీ అద్యక్షుడు రవిచంద్రయాదవ్‌ వల్ల పార్టీలో చేరాల్సిన కొందరు వేరే పార్టీలో చేరారని చంద్రబాబు భావిస్తున్నారట. పార్టీలో తాను, తన కుమారుడు మాత్రమే ఎదగాలని మంత్రి సోమిరెడ్డి కోరుకుంటున్నారని కొందరు నాయకులు 'చంద్రబాబు'కు ఫిర్యాదు చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకునిగా ఆయనను అభిమానిస్తుంటే...పార్టీని ఆయన బలహీనపరుస్తున్నారని చంద్రబాబు వివిధ నివేదికల ద్వారా తెలుసుకున్నారు. మంత్రి సోమిరెడ్డి, రవిచంద్రయాదవ్‌, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ, ఉదయగిరి ఎమ్మెల్యే రామారావులపై అటు కార్యకర్తల్లోనూ, ఇటు ఓటర్లల్లోనూ వ్యతిరేకత బయటపడింది. ముందుగా 'సోమిరెడ్డి' దూకుడుకు అడ్డుకట్టవేయండి...ఆయన కుమారుడి ప్రమేయాన్ని తగ్గించాలని చంద్రబాబుకు ఇంటిలిజెన్స్‌ నివేదిక ఇచ్చిందట. ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తున్నాయి..పార్టీ బలహీనంగా ఉంది..? ప్రస్తుత పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ఎన్నిసీట్లుపార్టీ గెలుస్తుందని చంద్రబాబు నాయకులను ప్రశ్నించారట. చంద్రబాబుతో అందరి ముందు మాట్లాడలేమని, ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఇస్తే..అన్ని విషయాలను చెబుతానని..ఒక సీనియర్‌ నాయకుడు చెప్పగా..తప్పకుండా అవకాశం ఇస్తానని చంద్రబాబు చెప్పారు. వ్యవసాయశాఖలో జరుగుతున్న అవినీతి, ఇతర సమస్యలపై దృష్టిసారించకుండా, స్వపక్ష నియోజకవర్గాల్లోనే 'సోమిరెడ్డి' చిచ్చుపెడుతున్నారని తెలుసుకున్న 'చంద్రబాబు' ఇకనైనా పద్దతి మార్చుకోండి..అని కటువుగా చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా నెల్లూరు జిల్లాలో మంత్రి సోమిరెడ్డి, రవిచంద్ర దూకుడుకు చంద్రబాబు అడ్డుకట్టవేయడంతో అనేక నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, ఇతర ముఖ్యులు..ఇప్పటికైనా అధినేత మేల్కన్నారని కితాబు ఇస్తున్నారు.

(271)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ