WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రేపల్లె' నుంచి 'సుమన్‌' పోటీ...!?

సినీనటుడు సుమన్‌కు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఆయన ఏనాడూ..ముందుకు వచ్చి తాను పోటీ చేస్తానని 'చంద్రబాబు'కు చెప్పేందుకు వెనాకాడేవారు.కానీ ఈ మధ్య కాలంలో ఆయన గుంటూరు జిల్లాలో పలు కార్యక్రమాలకు ఆయన హాజరవుతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు అందుకే ఇక్కడి కార్యక్రమాలకు హాజరవుతున్నారని తెలుస్తోంది. బిసీ వర్గాలు ఎక్కువగా ఉన్న 'రేపల్లె' నుంచి ఆయన పోటీ చేయాలని ఉత్సాహపడుతున్నారట. అటు సినీ గ్లామర్‌తో పాటు..ఇటు వర్గాల తోడ్పాటు టిడిపి స్థానిక నేతల మరియు కార్యకర్తల అండతో సులువుగా విజయం సాధించవచ్చుననేది 'సుమన్‌' నమ్మకం. నియోజకవర్గ ఎమ్మెల్యే కోడి పందాలు నిర్వహించి అప్రదిష్టపాలయ్యారు. ఇతర దేశాల పర్యటనలు చేస్తూ చతుర్ముఖ పారాయణంలో మునిగితేలుతుంటారనే ప్రచారం ఉంది. అంతే కాకుండా హైదరాబాద్‌లోనే ఆయన ఎక్కువగా ఉంటారని...నియోజకవర్గ పెత్తనాన్ని కొందరికి ఇచ్చి అప్రదిష్ట కూడగట్టుకున్నారు. కోడి పందాలు నిర్వహించవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నాయి...ముఖ్యమంత్రి కూడా వద్దని చెప్పినా...ఎమ్మెల్యే మాత్రం కోడి పందాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సామాజికవర్గానికి చెందిన 'సుమన్‌'ను బరిలోకి దింపితే...అవలీలగా విజయంసాధించడమే కాకుండా..లోక్‌సభ అభ్యర్థికి కూడా అఖండ మెజార్టీ వస్తుందని స్థానిక నేతలు చెబుతున్నారు. చివరకు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో..పోటీ చేయాలని 'సుమన్‌' పట్టుపడతారా..? అవకాశం ఇస్తే పోటీ చేస్తానంటారా..? ఏది ఏమైనా 'సుమన్‌' పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారంతో రేపల్లె నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు మనస్ఫూర్తిగా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ 'సుమన్‌'కు అవకాశం ఇస్తే..ఎమ్మెల్యేకు ఏ హామీ ఇచ్చి..పార్టీకి వ్యతిరేకంగా పనిచేయకుండా 'చంద్రబాబు' ఆపగలరో..?

(524)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ