WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ప్రతిభ' అవుట్‌...'కొండ్రు'..ఇన్‌...!

మాజీ స్పీకర్‌ శ్రీమతి ప్రతిభాభారతిని రాజాం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించి మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్‌ను నియమిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. మంత్రిగా, స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రతిభా భారతికి గతంలో ఎమ్మెల్సీ ఇచ్చినా పనితీరు, పద్దతి మార్చుకోకపోవడంతో..ఆమెపై వేటు వేయాలని భావించినా..సరైన నేతలేక ఆగిపోయారు. ఇప్పుడు మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌ పార్టీలో చేరడంతో ఆమెపై వేటు వేశారు. నియోజకవర్గంలో పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న 'ప్రతిభాభారతి'ని అడ్డుపెట్టుకుని..ఆమె పిఎ ఒకరు భారీస్థాయిలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె వ్యక్తిగత సహాయకుడు అవినీతికి పాల్పడుతున్నాడని తెలిసినా..ఆమె అతనిపై చర్యలు తీసుకోలేదు. మూడుసార్లు ఓడిపోయిన ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చినా..ఆమెలో మార్పు రాకపోవడం, కార్యకర్తలను,నాయకులను పట్టించుకోకుండా వ్యవహరించిన 'ప్రతిభాభారతి'పై సమయం చూసి 'చంద్రబాబు' వేటువేశారు. ఒకప్పుడు ఎచ్చెర్ల రిజర్వేడ్‌ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు విజయం సాధించిన 'ప్రతిభాభారతి' మంత్రి పదవి నిర్వహించారు..స్పీకర్‌ పదవిని నిర్వహించి ఓడిపోయారు. 

 2009లో నియోజకవర్గ పునర్విభజనతో ఆమె 'రాజాం' నుంచి పోటీ చేసి ఓటమిచెందారు. పేరుకే దళిత సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే అని కానీ ఆమె దళితులను దగ్గరకు రానీయలేదనే విమర్శలు ఉన్నాయి. తన కుటుంబం చాలా పెద్ద కుటుంబమని..కింద వర్గాల్లోకి చొచ్చుకుపోలేక ఆమె రాజకీయంగా దెబ్బతిన్నారు. ప్రతిభాభారతికి మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతోనే 'కోండ్రు'ను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించి భవిష్యత్‌ పార్టీ అభ్యర్థి అని సూచనలు ఇచ్చారు 'చంద్రబాబు'. ఎప్పుడైతే..'కోండ్రు'ను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా చంద్రబాబు నియమించడంతో..కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారట. కోండ్రును ఆహ్వానించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారట. దళిత మహిళా కోటాలో ఎన్ని అవకాశాలు వచ్చినా..తాను ప్రముఖ వ్యక్తి కుమార్తెను అనే భావనతో తన సామాజికవర్గాన్నే దరిచేరనీయలేదు ఆమె. నిన్నా మొన్నటి వరకు ఆమెకు మద్దతు ఇచ్చిన మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఆమెను నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి నుంచి తొలగించబోతు న్నారని తెలిసినా కూడా మౌనం వహించారు. దీనిని బట్టి నియోజకవర్గంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మంత్రి యనమలకు కూడా తెలిసింది ఉంటుంది. ఏది ఏమైనా చంద్రబాబు ఇంత కఠినంగా వ్యవహరిస్తారని 'ప్రతిభా' ఊహించలేదు. పార్టీలో చేర్చుకుని..నియోజకవర్గ బాధ్యతలు అప్పచెబుతారని మాజీ మంత్రి కోండ్రు కూడా ఊహించలేకపోయారు. చంద్రబాబు ఎంత కఠినంగా వ్యవహరిస్తారో..స్పష్టమైంది..దీనిని బట్టి మిగతా నాయకులు..పాఠాలు నేర్చుకోవాలని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

(344)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ