WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సిఎస్‌' రేసులో 'ఎల్‌వి సుబ్రహ్మణ్యం'...!

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సిసిఎల్‌ఎగా బాధ్యతలు నిర్వహిస్తున్న అనిల్‌చంద్రపునీతాను నియమించేందుకు రంగం సిద్ధమైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆ పోస్టులో ప్రస్తుత సిఎస్‌ పోస్టుఆశిస్తున్న వారందరి కంటే సీనియర్‌ అయిన ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం పేరు వచ్చింది. ఎల్‌వితో ముఖ్యమంత్రి ఏకాంతంగా మాట్లాడారని..ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన చంద్రబాబు ఆయనకు సిఎస్‌ పోస్టు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. 1983 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారుల్లో మొదటి స్థానంలో ఉన్న ఎల్‌వికి సిఎస్‌ పోస్టు ఎప్పుడో దక్కాల్సి ఉండగా..ఆయన కన్నా జూనియర్లు అయిన 'అజయ్‌కల్లం' మూడు నెలల పాటు, 18 నెలలు పాటు 'దినేష్‌కుమార్‌' ఆ పోస్టును నిర్వహిస్తున్నారు. ఇన్నేళ్ల సర్వీసులో అవినీతి మచ్చలేని 'ఎల్‌వి'ని ముఖ్యమంత్రి ఎందుకు దూరం పెడుతున్నారో...సచివాలయ అధికారులకు అంతుబట్టడం లేదు. 

 నిబంధనల మేరకు నిర్ణయాలు తీసుకునే 'ఎల్‌వి' గురించి 'చంద్రబాబు'కు చెడుగా చెప్పారని, అందుకే ఆయనను దూరం పెట్టారని..తాజాగా వాస్తవాలు తెలుసుకుని, ఆయన సీనియారిటీనీ పరిగణలోకి తీసుకుని..ఆయనకు సిఎస్‌ పోస్టు ఇవ్వబోతున్నారని అధికారవర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా..ప్రధాన కార్యదర్శి పోస్టుకు కావాల్సిన అర్హతలతో పాటు సీనియార్టీ, సిన్సియార్టీ 'ఎల్‌వి'కి ఉన్నదన్నది వాస్తవం. గతంలో ఎవరో చేసిన తప్పులకు ఆయన మూల్యం చెల్లించుకున్నారే తప్ప..ఆయన ఎటువంటి తప్పులు చేయలేదన్నది నిజం అని ఒక సీనియర్‌ అధికారి 'జనమ్‌ఆన్‌లైన్‌ప్రత్యేకప్రతినిధి'తో అన్నారు. 'ఎల్‌వి'ని సిఎస్‌గా నియమిస్తే..ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని..ఆయన ఉపకారం చేస్తారో...లేదో..కానీ అపకారం మాత్రం చేయరని..సచివాలయ కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులు చెబుతున్నారు. ఇదంతా కట్టుకథ..'ఎల్‌వి' పేరును పథకం ప్రకారం కొంత మంది తెరపైకి తెస్తున్నారు..సిసిఎల్‌ఎగా పనిచేస్తోన్న 'పునీతా'నే సిఎస్‌ అవుతారనే వాదన వినిపిస్తోంది.ఎవరు ఏ విధంగా భావించినా... ముఖ్యమంత్రి చంద్రబాబు 'పునీతా'కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారనే ప్రచారాన్ని నిజం చేస్తారా..? అధికారుల్లో సీనియర్‌ అయిన 'ఎల్‌వి' నియమిస్తారా...? సిఎం అమెరికా పర్యటనంతరం మాత్రమే ఆయన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

(227)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ