WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జెసి' వ్యాఖ్యలపై భగ్గుమంటోన్న పోలీసు యంత్రాంగం...!

రాష్ట్ర పోలీసు వ్యవస్థను కించపరిచే విధంగా మాజీమంత్రి, అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆగ్రహం చెందిన పోలీసు వర్గాలు ఆయన మర్యాదగా క్షమాపణ చెప్పాలని పోలీసులను కించపరిస్తే సహించమని హెచ్చరిస్తూ..హద్దుమీరినా..నోరు జారినా నాలుక కోస్తామని పోలీసు అధికారి చేసిన ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజకీయ నాయకులను నిత్యం కాపాడుతున్న వ్యవస్థే పోలీసులని, ఆ వ్యవస్థలో పనిచేస్తోన్న వారిని పత్రికల్లో రాయలేని భాషలో దూషించడం ఎంత వరకు సబబు అని పోలీసు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అనంతపురం జిల్లా పోలీసు సంఘ కార్యదర్శి 'గోరంట్ల మాధవ్‌' చేసిన ప్రకటనను పోలీసు వర్గాలు సమర్థిస్తున్నాయి. గన్‌మెన్‌లు లేకుండా 'జెసి' కానీ..ఆయన కుటుంబ సభ్యులు బయటకు వెళ్లగలుగుతారా..? రక్షణ కోసం తాము కావాలని...తాము లేకుండా వారు మనగలుగుతారా..? చట్టం 'జెసి' చుట్టం కాదని అనేక సందర్బాల్లో అల్లర్లు జరిగినప్పుడు అణిచివేసిన సంఘటనలను 'జెసి' మరిచిపోయారా..? అనేక మంది పోలీసు అధికారులు మీడియా వర్గాలతో మాట్లాడుతూ...పౌరషం జెసి ఒక్కరికే కాదు...మాకూ ఉంది. పోలీసు వ్యవస్థ అంటే పౌరషం ఉంటే వ్యవస్థ అని...చట్ట ప్రకారమే తాను నడుస్తామంటున్నారు. మా వాడు మీసం మెలేసి సవాల్‌ విసిరారు...హిజ్రాలతో పోలిస్తే..ఊరుకుంటామా..? కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు ఏనాడూ తమను విమర్శించలేదని, గతంలోనూ 'జెసి' కుటుంబసభ్యులు తమను ఇబ్బందులు పెట్టారు....టిడిపి ప్రభుత్వ హయాంలోనూ అదే విధంగా జరగడం తమకు బాధిస్తుందని చెప్పారు. 

  రాయలసీమ జిల్లాలో ఫ్యాక్షన్‌ను అంత మొందించినది పోలీసులేనని...ఎక్కడో స్వల్ప విషయాలు తప్ప..పోలీసులు బాగా పనిచేస్తున్నాయని...తాము తమ కుటుంబ సభ్యులతో గడిపకుండా పనిచేస్తున్నామని..అయినా తమను హిజ్రాలతో పోల్చిన 'జెసి' అంతకు ముందు తమ శక్తియుక్తులను జెసి చూశారని..అప్పుడు శభాష్‌ అని ఇప్పుడు 'హిజ్రా'లతో పోలుస్తారా..? అని ఎండగడుతున్నారు. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఆ రోజు స్వామీజీ మనుషులు దాడులు చేస్తే..అందరం పరిగెత్తాం...తాను ఆరోజు పరుగెత్తానని..ఆ మాట తనుకూ వర్తిస్తుందని ఆ మాట ఇబ్బంది అనిపిస్తే..తాను  చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని..జెసి శుక్రవారం నాడు చెప్పారు. పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోంది కాబట్టే..తీవ్రవాదాన్ని అంతమొందిచ్చామని కీ.శే. రాజశేఖర్‌రెడ్డి చెప్పారని పోలీసులు అంటున్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఇటువంటి సంఘటనలు ఎదురవుతాయని తాము భావించలేదని కొందరు పోలీసు అధికారులు అంటున్నారు. జెసి వ్యాఖ్యలపై టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు స్పందిస్తూ...ఇది పార్టీ సంస్కృతి కాదని..వ్యాఖ్యానిస్తున్నారు. విపక్షనాయకులు కానీ, జగన్‌లు 'జెసి' వ్యాఖ్యలపై స్పందించకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో...వేచి చూడాలి.

(226)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ